Discovery Lookback 2024 : భారతీయ అంతరిక్ష పరిశోధనలో 2024 సంవత్సరంలో కొత్త శిఖరాలు చేరుకోవడం జరిగింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వంటి అనేక అంతరిక్ష సంస్థలు, విశ్వం గుట్టు విప్పేందుకు కొత్త మిషన్లను చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆంగ్ల కాలెండరులో అనేక ప్రత్యేకమైన మిషన్లు ప్రారంభించబడ్డాయి.
ఇస్రో ప్రోబా-3 మిషన్
2024 డిసెంబర్ 5న, ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-సీ59 రాకెట్‌తో ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్‌లో భాగంగా, కరోనాగ్రాఫ్ , ఓకల్టర్ ఉపగ్రహాలు సూర్యుడి కరోనాను అధ్యయనం చేస్తున్నాయి. ఇవి సూర్యుడు యొక్క బయటి పొరను అధ్యయనం చేయడానికి, సౌర తుపానులపై పరిశోధన చేయడానికి ఉపయోగపడతాయి.
పోలారిస్ డాన్ మిషన్
స్పేస్‌ఎక్స్, ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో, సెప్టెంబరులో పోలారిస్ డాన్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్‌లో వ్యోమగాములను నింగిలోకి పంపిన స్పేస్‌ఎక్స్, ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను నిర్వహించి, 40 రకాల పరిశోధనలను చేపట్టింది. మైక్రో గ్రావిటీలో శరీర పనితీరు, కిడ్నీ పనితీరు, సీపీఆర్ వంటి అంశాలపై పరిశోధన జరిగింది.
యూరోపా క్లిప్పర్ మిషన్
నాసా అక్టోబర్‌లో యూరోపా క్లిప్పర్ మిషన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా జూపిటర్ చంద్రుడు యూరోపాను అధ్యయనం చేయడం, అక్కడ నీటి ఉనికిని , జీవం ఉండే అవకాశాలను పర్యవేక్షించడం ఉద్దేశ్యం.
చాంగ్-ఇ 6 మిషన్
చైనా, 2024 మేలో చాంగ్-ఇ 6 మిషన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా చంద్రుని మారుమూల ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి పరిశోధన చేపడతారు. ఈ మిషన్, చంద్రుని నిర్మాణం, భౌగోళిక వ్యత్యాసాలు వంటి కొత్త సమాచారాలను అందించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
టియాన్‌లాంగ్-3 మిషన్
చైనా 2024లో టియాన్‌లాంగ్-3 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్, భూమి కక్ష్యలో ఉపగ్రహాలను ఉంచడానికి ఉపయోగపడుతుంది. ప్రైవేటు అంతరిక్ష రంగంలో పోటీని ప్రోత్సహించడం కూడా దీని ఉద్దేశ్యం.
స్లిమ్ మిషన్
జపాన్, జాక్సా ద్వారా 2024లో స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్, చంద్రుడిపై ఖచ్చితమైన ల్యాండింగ్ సాంకేతికతను పరీక్షించేందుకు రూపొందించారు.
పెరెగ్రైన్-1 మిషన్
ఆస్ట్రోబోటిక్ కంపెనీ 2024లో పెరెగ్రైన్-1 మిషన్‌ను ప్రారంభించింది. ఇది నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా, చంద్రుని పై డేటా సేకరించడానికి రూపొందించబడింది.
ఈ 2024 మిషన్లు అంతరిక్ష పరిశోధనలో అంచెలంచెలుగా ప్రతిష్ఠాత్మక పురోగతిని అందించాయి.
Read Also : Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం