Bath: స్నానం ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

చాలామందికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే అలవాటు ఉంటుంది. మరికొందరికి రోజుకు ఒక్కసారి

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 08:00 AM IST

చాలామందికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే అలవాటు ఉంటుంది. మరికొందరికి రోజుకు ఒక్కసారి స్నానం చేసే అలవాటు ఉంటుంది. చాలా తక్కువ మంది రోజు విడిచి రోజు స్నానం చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఉదయం పూట స్నానం చేస్తే ఇంకొందరు మాత్రం రాత్రి సమయంలో స్నానం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కొందరు ఉదయం పూట మాత్రమే స్నానం చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు అని అంటూ ఉంటారు. అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఆయుర్వేద ప్రకారం ఉదయాన్నే స్నానానికి సరైన సమయం.

ఎందుకంటే ఉదయ స్నానం అనేక రకాల వ్యాధులను నివారించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. అయితే ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. స్నానం మానసిక అలాగే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు స్నానం చేసే వారిలో సాధారణ స్నానం చేసే వారి కంటే నొప్పి ఒత్తిడి ఆందోళన వంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి. ఉదయం సాయంత్రం స్నానం చేయడంలో ఏది మంచిది అంటే ఉదయం స్నానం చేయడమే మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

చాలామందికి ఉదయం పూట వ్యాయామం చేసే అలవాటు ఉంటుంది. అటువంటి వారి వ్యాయామం చేసిన తర్వాత శరీరం అలిసిపోయి ఉంటుంది కాబట్టి స్నానం చేయడం వల్ల ఉపశమనం లభించి ఫ్రెష్ గా తాజాగా ఉంటారు. సూర్యోదయం లేదా సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే తిన్న తర్వాత కూడా స్నానం చేయడం అస్సలు మంచిది కాదు. తిన్న తర్వాత స్నానం చేస్తే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. రాత్రిపూట తల స్నానం చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటె రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల జుట్టు సరిగ్గా ఆరదు. దీంతో మైయోసైటిస్ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.