Raw Milk: పచ్చిపాలతో ఇలా చేస్తే చాలు.. ముఖం మెరవడం ఖాయం?

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం తెలిసిందే. పాలు తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ చాలామంది పాలు తాగడానికి

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 09:50 PM IST

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం తెలిసిందే. పాలు తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ చాలామంది పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అయితే పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పచ్చిపాలలో చర్మానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. అటువంటి పరిస్థితిలో, చర్మంపై పచ్చిపాలను ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. మారి పచ్చి పాలను అప్లై చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పచ్చిపాలని మీ స్కిన్‌పై టోనర్‌గా వాడవచ్చు. ఎలా రాయాలంటే రాత్రి పడుకునేటప్పుడు చర్మానికి పచ్చిపాలని రాయాలి. దీని వల్ల స్కిన్ బిగుతుగా మారుతుంది. పచ్చిపాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చేయడమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది. మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పచ్చిపాలని వాడడం చాలా బావుంటుంది. ఇది మీ ముఖం నుండి మురికిని పోగొట్టడమే కాకుండా, సహజ తేమని అలానే ఉండేలా చేస్తుంది. ఇది చర్మానికి పోషణ, తేమని అందిస్తుంది. మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది. మీరు పచ్చిపాలతో చర్మాన్ని మసాజ్ చేయాలి.

పచ్చి పాలలో దూదిని నానబెట్టి ముఖానికి అప్లై చేయండి. తర్వాత తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ బాగా జరిగి చర్మం తాజాగా కనిపిస్తుంది. ఇందుకోసం పచ్చి పాలు ఒక గిన్నెలో తీసుకొని అందులో శనగపిండి, తేనె కలపాలి. ఇప్పుడు దానిని మీ చర్మానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు సాధారణ నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మురికి తొలగిపోతుంది.