Site icon HashtagU Telugu

For Good Mood: మీ మూడ్ బాగలేదా.. అయితే వీటిని ట్రై చేయండి..!

Life Style Health

Life Style Health

మన మూడ్ ఎలా ఉండాలో మ‌న‌మే డిసైట్ చేసుకుంటాం. మూడ్ బాగుంటే హ్యాపీగా ఉంటాం. లేదంటే.. తోటివారి ఎంత ప్రేమగా మాట్లాడినా చిరాకు వ‌స్తాది. ఇలాంటి సమయంలో ఇతరులు మ‌న‌తో మాట్లాడుతున్న‌.. మ‌న‌కు అస్సలు మాట్లాడాలనిపించదు. అయితే మూడ్ ఆఫ్ అయిన‌ప్పుడు కొన్ని రకాల ప‌దార్థాల‌ను (ఫుడ్స్‌) తింటే మాత్రం మూడ్ ఆటోమెటిగ్ గా ఛేంజ్ అవుతుందంటా. ఆ ఫుడ్‌ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా చేయడంతో పాటు.. హుషారుగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవడం వల్ల శరీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరెప్పుడైనా డల్ గా మారితే.. ఈ ఆహారాలను తిని చూడండి. వెంటనే మీ మూడ్ మారిపోతుంది.

ఓట్స్

బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తినాలని వైద్యులు చెబుతుంటారు. ఓట్స్ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. ఓట్స్‌లో ఐరన్ కంటెంట్ ఎక్కువ‌. ఇది శక్తివంతంగా చేస్తుంది. అలాగే ఇవి తింటే వెంట‌నే హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు. అందుకే చాలా మంది వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తిన్నారు. రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు.

అరటిపండ్లు

అరటిపండ్లు ఈ పండ్లు తెలియ‌ని వారుండ‌రు. మన ఆరోగ్యానికి అర‌టిపండ్లు చాలా అవసరం. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి6, చక్కెర, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

బీన్స్, కాయధాన్యాలు

బీన్స్, కాయధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, పొటాషియం, జింక్‌లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా చేయడంతో పాటు మీ మూడ్‌ను ఛేంజ్ చేసి ఉత్సాహంగా ఉంచుతాయి.

డార్క్ చాక్లెట్స్

ర్క్ చాక్లెట్ మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపే పోషకాలతో నిండి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ కోకో సీడ్ నుండి తయారవుతాయి. ఇది యాంటీఆక్సిడెంట్ల ఉత్తమ వనరులలో ఒకటి. డార్క్ చాక్లెట్ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చాక్లెట్‌లో ఉండే సమ్మేళనాలు డోపమైన్‌ను పెంచేందుకు సహాయపడి.. మీరు హ్యీపీ మూడ్‌లోకి ఛేంజ్ అవుతారు.

నట్స్

​నట్స్​ను నేరుగా తినడం కంటే రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నట్స్‌లో ఎన్నో పోషకాలుంటాయ‌ని తెలిసిందే. రోజూ గుప్పెడు గింజలను తింటే శరీరంలో విటమిన్ల లోపం పోతుంది. బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మూడ్ బాగాలేనప్పుడు కొన్ని గింజలను నమలడం వల్ల హ్యాపీ మూడ్‌లోకి మారిపోతారు.లు పోతాయ‌ట‌.