Site icon HashtagU Telugu

Relationship : ఈ 9 విషయాలు జరిగితే.. మీ బోయ్ ఫ్రెండ్ కి దూరమవడం మంచింది..!

If Your Boyfriend Says These 9 Things, Then You’re Not Going To Last

If Your Boyfriend Says These 9 Things, Then You’re Not Going To Last

Relationship రిలేషన్ షిప్ లోనో లేక పెళ్లై కొత్త జీవితం మొదలు పెడితేనో ఇద్దరు వ్యక్తులు సమపాళ్లలో తమ ప్రేమని పంచుకోవాలి. ఈ విషయంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చూడటం మంచిది కాదు. అయితే కొన్ని విషయాలు అవతల వ్యక్తి తమని దూరం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడన్న సైన్ కనిపిస్తుంది. అలా ఈ 9 విషయాలు జరుగుతున్నట్టు అయితే మీ బోయ్ ఫ్రెండ్ లేదా హస్బండ్ వాళ్లకు మీరు దూరగా ఉండటం మంచిందని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join

ఇంతకీ ఏంటా 9 విషయాలు అంటే..

1. పెళ్లి మీద నమ్మకం లేదని చెప్పడం

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎవరైతే పెళ్లి మీద నమ్మకం లేదని చెబుతారో వారు మీతో ఉన్న రిలేషన్ షిప్ ని సీరియస్ గా తీసుకోవట్లేదని అర్ధం. పెళ్లి దాకా మీ బంధాన్ని తీసుకెళ్లలేడని స్పష్టంగా అర్ధమవుతుంది.

2. ఎక్స్ గురించి చర్చించడం

మీతో కలిసి ఉంటూనే తన ఎక్స్ లవర్ గురించి తరచు ప్రస్థావించడం కూడా అంతగా మంచిది కాదు. మీ పక్కన ఉంటూ ఎక్స్ ని గుర్తుచేసుకోవడం ఆమె గురించి మాట్లాడటం లాంటివి కూడా మీకు అతను దూరం అవుతున్నాడని లెక్క.

3. డ్రెస్సింగ్ మీద ఆంక్షలు

ఇష్టాన్ని చూపించే కొన్ని అయిస్టాలతో కూడా పోల్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ దొరుతుందా గొడవ పడదామని కొందరు చూస్తుంటారు. అలా మీరు వేసుకున్న డ్రెస్ నచ్చలేదని డ్రెస్సింగ్ సెన్స్ మీద కామెంట్ చేస్తుంటారు. అలాంటి వారితో కలిసి ఉన్నంతవరకు చాలు మీరు వారిని దూరంగా పెట్టడం బెటర్.

4. కేవలం ఇంటిపనులు చూస్తే చాలు

మీకున్న కలలకు విలువ లేకుండా కేవలం ఇంటి పనులకు మాత్రమే మిమ్మల్ని అంకితం చేయాలని చూడటం. అలాంటి వారు కూడా మీ జీవితం లో ఉన్నా ఈ బంధం ఎన్నాళ్లో సాగే అవకాశం ఉండదు.

Also Read : Semiya Pulihora : సేమియాతో ఒక్కసారి ఇలా నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి

5. ఆ టైం లో కూడా

పీరియడ్స్ టైం లో కూడా మీ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా.. ప్రేమగా చూడలేని వారితో మీరు కలిసి ఉన్నా ఆ రిలేషన్ షిప్ ఎంతోకాలం నిలబడదని చెప్పొచ్చు.

6. పైకి మాత్రమే క్రేజీ

మిమ్మల్ని బుట్టలో పడేసేందుకు పైకి మాత్రమే క్రేజీ అంటుంటారు కానీ వారి లోపల ఆలోచన వేరేలా ఉంటుంది. ఎప్పుడూ మీ మీద ప్రేమ అభిమానం చూపించే వారికి దగ్గరవడం మంచిది కానీ కావాలని ప్రేమ చూపించడం వల్ల ఉపయోగం ఉండదు.

7. ఓపెన్ రిలేషన్ షిప్ అంటూ

మీర్ రిలేషన్ షిప్ ని ఓపెన్ రిలేషన్ షిప్ అనడం వల్ల మీరు చేస్తుంది సీక్రెట్ రిలేషన్ షిప్ కాదని చెప్పినట్టే. అంటే మీరు ఊహించినట్టుగా అతను మీతో సీరియస్ రిలేషన్ షిప్ లో లేరని అర్ధం. అందుకే ఓపెన్ రిలేషన్ షిప్ అని చెబుతుంటారు.

8. అలా చేస్తే బ్రేకప్ చెప్పేస్తా

నాకు నచ్చని పనులు చేస్తే బ్రేకప్ చెప్పేస్తా అని అనడం. గొడవ టైం లో చీటికి మాటికీ బ్రేకప్ అనె వారికి దూరంగా ఉండటం బెటర్.

9. సపోర్ట్ గా ఉండమని అడగడం

వారు మీ గురించి ఆలోచించరు కానీ వారికి మీరు ఎప్పుడూ సపోర్ట్ గా ఉండాలని అడుగుతారు. అలా సపోర్ట్ గా ఉండమని అడిగే వారు కేవలం తమ స్వార్ధం కోసమే చూసుకుంటారు.