Site icon HashtagU Telugu

Dark Circles: కళ్ళ కింద ఇది ఒక్కసారి రాస్తే చాలు.. నలుపు మటుమాయం పోవాల్సిందే?

Mixcollage 03 Mar 2024 02 21 Pm 417

Mixcollage 03 Mar 2024 02 21 Pm 417

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖం అందంగా ఉన్న కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అనేక రకాల చిట్కాలను, బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు రావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కంటి కింద నల్లటి వలయాలు వస్తున్నాయి అంటే మీ శరీరంలో ఏదో మార్పు చోటు చేసుకుంటుందని అర్థం. కంటి కింద పొర చాలా పలచగా ఉంటుంది. ఎక్కువ సేపు ఫోన్ చూడటం వలన కలుషితమైన గాలి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, పొగ తాగడం, ఎండలో బాగా తిరగడం ఇవన్నీ కూడా కంటి కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. కంటి డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి సంబంధించిన పదార్థాలు మీ ఇంట్లోని వంట గదిలోనే దొరుకుతాయి. కొంతమంది ఇళ్లలో ఇది ఉండకపోవచ్చు. కానీ ఈ పదార్థం దగ్గర్లోని షాప్స్ లో కూడా దొరుకుతుంది.

మీకు తెలుసా అదే కరక్కాయ ఈ కరక్కాయలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. దీనిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కరక్కాయ తీసుకొని దానిని బాగా అరగ తీయాలి. అలా అరగదీసినప్పుడు ఒక క్రీమ్ లాంటిది వస్తుంది. మీరేం చేయాలంటే మీ ఉంగరపు వేలుతో ఆ పేస్ట్ తీసుకుని మీ కంటి నీ అద్దంలో చూస్తూ ఆ నల్ల వలయాలు మీద రాసుకోండి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున వారం రోజులు చేయాలి. నెమ్మదిగా మీ కంటికి నల్లటి మచ్చలు తగ్గుతాయి. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైనా దీన్ని రాసుకోవచ్చు.