Pineapple Pack : చర్మం మిలమిల మెరిసిపోవాలంటే అనాసపండుతో ఇలా ప్యాక్ వేయాల్సిందే..

అనాసపండు (Pineapple)ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 12:32 PM IST

Pineapple Pack for Glowing Skin : అనాసపండు.. దీనినే ఇంగ్లీష్ లో పైనాపిల్ అని పిలుస్తూ ఉంటారు. చాలామంది అనాస పండు అంటే తెలియకపోవచ్చు కానీ పైనాపిల్ అంటే చాలు బాగా గుర్తుపట్టేస్తారు. ఈ పైనాపిల్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పైనాపిల్ కాస్త తీయగా, కొంచెం పుల్లగా ఉంటుంది. అనాసపండు (Pineapple)ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఈ పండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి పైనాపిల్ తో అందాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

అనాసపండు (Pineapple)లోని బ్రోమెలైన్‌ చర్మం వాపు, ఎరుపు, వాపు, చికాకును శాంతపరచడానికి తోడ్పడుతుంది. అనానపండు మన సౌందర్య పోషణకు ఎలా సహాయపడుతుందో, ఫైనాపిల్‌ ఫేస్‌ మాస్క్‌ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అనాసలో ఉండే విటమిన్ సి అమైనో యాసిడ్స్ చర్మంలో కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి తద్వారా చర్మం బిగుతుగా, పటుత్వం కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మంపై పేరుకొనే మృతకణాలను తొలగించి కాంతివంతంగా మారుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి.​

ముఖ్యంగా శీతాకాలం చలి కారణంగా.. చర్మం త్వరగా పొడిబారుతుంది. అలాంటప్పుడు ఫేస్ మాస్క్ వేసుకోవాల్సిందే. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ ప్యూరీ, రెండు టీస్పూన్ల తేనె, రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌‌లా తయారుచేసీ ఈ మిశ్రమాన్ని మూఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చ, తర్వత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ ని అప్లై చేయాలి. మీరు ఓపెన్‌ పోర్స్‌ కారణంగా ఇబ్బంది పడుతుంటే ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, ఓట్‌ మీల్‌ పౌడర్‌ కలిపి మిక్స్‌ చేయాలి.

ఈ విశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి..ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఓపెన్‌ పోర్స్‌ తగ్గుతాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, రెండు టీస్పూన్ల జోజోబా ఆయిల్‌ను మిక్స్‌ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనినిచ్చి, ఆ తర్వాత సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి..ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తుంది.​

Also Read:  Constipation Tips : మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..? అయితే పాప్ కార్న్ తినాల్సిందే..