Site icon HashtagU Telugu

Natural Blood Purification : రక్తాన్ని సహజసిద్ధంగా శుద్ధి చేయాలంటే..

Thalassemia

Blood Toxins

రక్తంలో (Blood) వ్యర్థపదార్థాలు పేరుకుంటే శరీరం అంతా రక్తప్రసరణ మెరుగ్గా జరగదు. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది, దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంది. రక్తంలో (Blood) టాక్సిన్స్‌ (Toxins) ఎక్కువైతే.. అనేక తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రక్తాన్ని (Blood) నేచురల్‌గా క్లీన్ చేయడనికి సహాయపడే.. అహార పదార్థాలు ఏమిటో తెలుసుకోండి.  అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో ఉండే టాక్సిన్స్ కారణంగా రక్తంలో మలినాలు ఏర్పడతాయి.

శారీరక, మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. రక్తంలో వ్యర్థపదార్థాలు పేరుకుంటే.. శరీరం అంతా రక్తప్రసరణ మెరుగ్గా జరగదు. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది, దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంది. రక్తంలో టాక్సిన్స్‌ ఎక్కువైతే.. అనేక తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

రక్తాన్ని శుభ్రపరచడంలో ఆహారం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో విషపదార్థాలు లేకుండా ఉండేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు, ఖరీదైన ఆహారాన్ని తినాల్సిన అవసరం లేదు. లివర్‌, కిడ్నీలు.. వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అందుకే ఈ అవయవాల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ అవయవాలు సరిగ్గా ఉంటే.. రక్తం స్వచ్ఛంగా ఉంటుంది. రక్తాన్ని నేచురల్‌గా క్లీన్ చేయడనికి సహాయపడే.. అహార పదార్థాలు ఏమిటో తెలుసుకోండి.

బీట్‌ రూట్‌ (Beetroot):

ATP జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, బీట్‌రూట్‌లో బీటాసైనిన్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్‌ యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బీట్‌ రూట్‌ను మీ డైట్‌లో తరచుగా తీసుకుంటే.. రక్తం క్లీన్‌ అవ్వడంతో పాటు, రక్తం కూడా పెరుగుతుంది. బీట్‌రూట్‌లోని పోషకాలు.. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు సలాడ్‌, జ్యూస్‌ రూపంలో తీసుకుంటే మంచిది.

బెల్లం (Jaggery):

బెల్లం న్యాచురల్‌ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. బెల్లం మీ డైట్‌లో తరచుగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. బెల్లం లివర్‌ను క్లీన్‌ చేస్తుంది, తద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. బెల్లంలో అధికంగా ఉండే.. ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుపడుతుంది.

పసుపు (Turmeric):

NCBI అధ్యయనం ప్రకారం, పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇది లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం శరీరంలోని అనేక సమస్యలతో పోరాడటంలో సహాయపడుతుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ఈ పాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

తులసి (Basil):

తులసిలోని ఔషధ గుణాలు.. మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులు తింటే.. రక్తం శుద్ధి అవుతుంది. . తులసి ఆకులలో ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. దీనితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.

వేప ఆకులు (Neem Leaves):

వేప రక్తంలో ఉండే టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో వేప ఆకులను నమిలి తర్వాత నీళ్లు తాగాలి. వేప ఆకులు జ్యూస్‌ తాగినా.. రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

వెల్లుల్లి (Garlic):

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు రోజూ తినడం వల్ల లివర్‌కు మేలు జరుగుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.

Also Read:  Unstoppable 2 : బాలయ్య అన్​ స్టాపబుల్​ షోలో ప్రభాస్, గోపీచంద్​..