Beauty Tips: ముఖంపై ఉండే మచ్చలు మాయం అవ్వాలంటే కొబ్బరి నూనెలో ఇది కలిపి రాయాల్సిందే?

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 12:00 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలామందికి ముఖం పైన పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నాయి. ఏదైనా కానీ మీ మొహం పాడవుతూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో చాలా మంది ఈ మంగు మచ్చలు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది మీ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. చాలా మంది వీటి నుంచి బయటపడడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీకు ఎన్ని మందులు వాడినా ఎన్ని పేస్టులు అప్లై చేసినా తిరిగి యధావిధిగా వచ్చేస్తుంటాయి.

మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈరోజు మేము మీ కోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము.. అవి ఇంటి చిట్కాలు. హాస్పిటల్స్ కి వెళ్లి వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోని వస్తువులతోని ఇది తయారు చేసుకోవచ్చు. దీనికోసం పసుపు, కొబ్బరి నూనె తీసుకోవాలి. పచ్చి పసుపు అంటే పసుపు కొమ్ములు అన్నమాట. ఇప్పుడు ఈ పసుపు కొమ్మును కొంచెం తడిపి బాగా రుద్దాలి. అలా కొద్దిసేపు రుద్దిన తర్వాత కొంచెం పొడి వస్తుంది కదా..అది స్వచ్ఛమైంది. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలపండి. ఇది ఇప్పుడు పేస్టులా తయారవుతుంది కదా.. ఎక్కువగా 45 సంవత్సరాల తర్వాత మంగు మచ్చలు సమస్య వస్తుంది. అన్నిటిలో ముఖ్యంగా ఇది మన బుగ్గలపై ముక్కుపై కనుబొమ్మలపై పెదవులపై కూడా ఉంటుంది.

ఇది నల్లటి వలయాల సమస్యలు తొలగించడానికి మొటిమలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరు రాత్రిపూట పడుకునే అరగంట ముందు అప్లై చేసి ఆ తర్వాత కావాలంటే పడుకునేటప్పుడు టిష్యూ పేపర్ లేదా కాటన్ క్లాత్ తేలిగ్గా తుడిచేయాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత అరిపోతుంది. అలాగే ఓ రెండు బాదం పప్పులు తీసుకోండి. వాటిని రాత్రి నీటిలో నానబెట్టాలి ఆ తర్వాత ఆ బాదం పప్పును బాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పొడిలో ఒక చెంచా పచ్చిపాలు పోసి బాగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈరోజుల్లో బాదం నూనె, బాదం పొడి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామందికి ఇది చేసుకునే సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు ఏమి అవసరం లేదు. ప్రతిరోజు పచ్చిపాలతో మీ ముఖాన్ని కొంతసేపు మసాజ్ చేయండి. అలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.