Site icon HashtagU Telugu

Weight Gain Foods: బక్క పల్చగా ఉన్నానని బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు స్పీడ్ గా బరువు పెరగాల్సిందే?

Mixcollage 04 Dec 2023 08 42 Pm 8

Mixcollage 04 Dec 2023 08 42 Pm 8

ఈ రోజుల్లో బరువు తగ్గాలి అనుకున్న వారు కొందరైతే బరువు పెరగాలి అనుకున్న వారు కూడా కొందరు. కొందరు అధిక బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం బక్క పల్చగా చాలా సన్నగా ఉంటారు. అటువంటి వారు బరువు పెరగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా బక్క పల్చగా ఉన్నారా. లావు పెరగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొన్ని పదార్థాలను తినడం వల్ల కచ్చితంగా బరువు పెరగడం ఖాయం అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు పెంచడానికి పచ్చికొబ్బరి బాగా ఉపయోగపడుతుంది.

అందుకని పచ్చి కొబ్బరిని మనం తురిమేసుకోవాలి. తర్వాత పచ్చి వేరు శనక్కాయలు తీసుకోవాలి. ఒకవేళ పచ్చివి లేకపోతే ఇంట్లో ఉన్న వేరుశనగ విత్తనాలను రాత్రంతా నీటిలో నాన పెడితే పొద్దున కల్లా పచ్చిగా అవుతాయి. తరవాత జీడిపప్పు కూడా తీసుకోవాలి. అలాగే పుచ్చ గింజలు ఈ పుచ్చ గింజల పప్పు అనేసరికి హై ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ బలము ఉంటుందన్నమాట. మనం పుచ్చకాయ ముక్కలు తినేసేసి గింజల్ని పడేస్తూ ఉంటాం. ఆ గింజలు లోపల పప్పుని వేరు చేసే అమ్మితే ఇది పుచ్చ గింజలు అన్నమాట. అది చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఇది బాగా మంచి కొవ్వును కలిగిస్తుంది. పొద్దు తిరుగుడు గింజలు. వీటితోపాటు గుమ్మడి గింజల పప్పు ఇది కూడా 20 శాతం పైన ప్రోటీన్ ఉంటుంది.

ఈ ఐదు కా రకాల విత్తనాల్ని నానబెట్టుకున్న వాటిని కొబ్బరి తురుముకుంటారు ఫ్రెష్ గా మిగతా వాటిని నానబెట్టుకున్న వాటిని 15 ఎండు ఖర్జూరాలు పెట్టుకొని వాటిని నంజుకుంటూ ఈ గింజలను తినాలి. సుమారుగా మీరు ఒక పది ఇడ్లీలు తింటే మీకు ఎనిమిది ఇడ్లీలు తింటే అంత శక్తి వస్తుందో అంత శక్తి ఈ పప్పులు ప్రసాదించేస్తాయి. బలం తక్కువ ఉంటుంది. అందుకని మీకు బలాన్ని బాగా ప్రసాదిస్తాయి. అలాగే ప్రోటీన్ ని మంచి శక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగవచ్చు. ఈ ఐదు రకాల విత్తనాల్ని పండ్లను మధ్యాహ్న పూట ఆఫీసుకి ఇలాంటివి పట్టుకెళ్ళి తినవచ్చు. ఈ ఐదింటిని బాగా తినడం వల్ల కండబలం పెరగడంతో పాటు బాగా లావు అవుతారు. అంతేకాకుండా పొట్ట కూడా పడదు.

Exit mobile version