Dark Circles : ఆ ఒక్క ప్యాక్ ట్రై చేస్తే చాలు పెదవులు ఎర్రగా మారడంతో పాటు డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాల్సిందే..

పెదవులు ఎర్రగా మార్చుకోవడం కోసం అలాగే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను (Dark Circles) తొలగించుకోవడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 10:00 PM IST

Tips for Dark Circles : మామూలుగా మనం ముఖం చూడగానే ఎర్రని పెదవులు ఆకర్షించే కళ్ళు అందమైన చిరునవ్వు గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో అనేక కారణాలవల్ల పెదవులు పొడిబారడం లేదా నల్లగా మారిపోవడం అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు (Dark Circles) ఏర్పడడం లాంటి వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పెదవులు ఎర్రగా మార్చుకోవడం కోసం అలాగే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను (Dark Circles) తొలగించుకోవడం కోసం అనేక రకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. వాటి వల్ల ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఈ రెండు సమస్యలను తొలగించడానికి ఒక ప్యాక్ ట్రై చేస్తే చాలు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ప్యాక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

కాగా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో సరిగ్గా నిద్రలేకపోవడం, వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. మన కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే, కెమికల్స్ ఉన్న క్రీమ్స్ వాడకపోవడమే మంచిది. అదే విధంగా, ఎక్కువగా ఒత్తిడి, కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం కూడా కంటి చుట్టూ నల్లని వలయాలు రావడానికి కారణం.

పెదవులు నల్లబడడానికి మన అలవాట్లే కారణమని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువగా పొగత్రాగడం వల్ల వస్తాయి. అదే విధంగా, ఎక్కువగా టీ తాగినా పెదవులు నల్లగా మారతాయి. వీటితో పాటు పెదాలను ఎప్పటికీ లాలాజలంతో తడపడం వల్ల కూడా సమస్య వస్తుంది. లాలాజలం పెదాలపై పొడిబారడం వల్ల త్వరగా నల్లగా మారతాయి. అంతే కాకుండా, లిప్ స్టిక్, లిప్ బామ్ ఎక్కువగా వాడడం వల్ల పెదవులు నల్లగా మారతాయి. ఇది కాకుండా, పెదవులు కొరకడం, అనేక సమస్యలు రావడానికి పెదవులు రంగు మారడానికి కారణమవుతాయి. ఈ రెండు సమస్యల్ని కూడా మీరు ఒకే ఒక్క ఇంటి చిట్కాతో దూరమవుతుంది. దీని వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలని దూరం చేయడం, పెదాలకి రంగు ఇవ్వడాన్ని హెల్ప్ చేస్తుంది. బీట్రూట్‌, పాలు ఈ రెండు పదార్థాలని కలిపి సమస్యని దూరం చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ తయారు చేయడానికి ముందుగా బీట్‌రూట్‌ని పేస్టులా చేసి అందులో అర టీ స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. దీనిని కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. పొడిగా మారాక సాధారణ నీటితో కడగాలి. ప్రతి రెండు వారాలకి ఒక సారి ఇలా చేయడం మంచిది.

అదే విధంగా, పెదాలకి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొద్దిగా ఆరాక దీనిని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎర్రగా, అందంగా మారతాయి. ఈ ఒక్క ప్యాక్ మాత్రమే కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పుష్కలంగా నీరు తాగాలి. రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగడం అవసరం. తగినంత నిద్ర పోవాలి.

Also Read:  Oats Pakoda: కరకరలాడే ఓట్స్ పకోడి.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?