Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?

8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Healthy Sleep Tips : 8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. రోజూ ఎక్కువ నిద్రపోయే వారు చాలా మంది ఉంటారు. తగినంత నిద్రపోని వారు కూడా చాలా మంది ఉంటారు. రాత్రిపూట 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం 74% ఎక్కువగా ఉంటుందని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది ప్రజలు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్నారని పరిశోధకులు అంచనా వేశారు.

పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ఏమిటి?

పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) కారణంగా ధమనులలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల అవి కుచించు కుపోవడం ప్రారంభిస్తాయి.దీని కారణంగా పాదాలు, చేతుల్లో రక్త ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది.  పాదాలకు సరైన మోతాదులో రక్తం చేరకపోవటం వల్ల మనిషి నడవలేని స్థితిలో ఉంటాడు. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధమనులలో తక్కువ రక్త ప్రవాహం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.  ఈ పరిశోధన యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడింది.  650,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

పగటిపూట నిద్రపోవడం యొక్క రిలేషన్ ..

స్టడీలో భాగంగా తొలుత పరిశోధకులు PAD ముప్పుతో పాటు నిద్రపోయే టైం, పగటిపూట నిద్రపోవడం యొక్క రిలేషన్ ను కలిపి విశ్లేషించారు. అయితే, స్టడీ రెండవ భాగంలో పరిశోధకులు దాని వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకోవడానికి జన్యు డేటాను ఉపయోగించారు. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోయే వ్యక్తులతో పోలిస్తే 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం దాదాపు రెండింతలు ఉంటుందని గుర్తించారు.

సీజన్‌లో మార్పు:

వాతావరణంలో మార్పు సంభవించినప్పుడు సాధారణం కంటే ఎక్కువ నిద్రపోవాల్సి ఉంటుంది. సీజన్ మార్పు కారణంగా రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను (Sleep) పోలేకపోవచ్చు. ఈ సందర్భంలో నిద్ర సమయాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ నిద్రించవలసి ఉంటుంది.

ఋతు చక్రం:

ప్రతి నెలా రుతుక్రమం సమయంలో స్త్రీల శరీరం అనేక అంతర్గత మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో ఆమె చాలా బలహీనత, అలసటను అనుభవిస్తుంది. కాబట్టి ఆమె ఋతు చక్రంలో సుమారు 9 గంటలు నిద్రపోవాలి. అప్పుడే ఆమె నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందగలుగుతుంది.

Also Read:  Arif & Sarus: ఆరిఫ్.. కొంగ.. హాట్ టాపిక్ గా మారిన ఒక అనుబంధం