బుడమ కాయ.. వీటిని మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో మాత్రమే కాకుండా తినడానికి కూడా ఉపయోగించేవారు. బుడమ కాయ పప్పు కూర పచ్చడి వేపుడు వంటివి చేసుకొని తినేవారు. కానీ రాను రాను వీటి వినియోగం చాలా వరకు తగ్గిపోయింది. ఈ మొక్కలు (Plant) మనకు ఎక్కువగా పల్లెటూర్లలో కనిపిస్తూ ఉంటాయి. పొలాల గట్టు ప్రాంతంలో ఎక్కువగా నేలపై పాకుతూ విరివిగా కాయలు కాస్తూ ఉంటాయి. ఈ కాయలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
బుడమ కాయలను విటమిన్ సి, ఎ పోలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్, ఫైబర్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తుంది. అలాగే శరీర కణాల పెరుగుదల మరమ్మత్తును ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన ముఖంపై ముడతలు, మచ్చలు రాకుండా చేస్తుంది. బుడమ కాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ బుడమ కాయలను తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను ఒక నియంత్రణలో ఉంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ బుడమ కాయలను కామెర్లు చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది. ఈ కాయలు తినడం వలన వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది.
Also Read: Sandals: గుడి దగ్గర చెప్పులు పోవడం మంచిదేనా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
