Kitchen Tips : వంటగదిని మనం సరిగ్గా వినియోగిస్తే.. ఆరోగ్యాలు విరబూయించే నిధి అవుతుంది. మన జీవనశైలికి ఆహార అభిరుచిని జోడించే పెన్నిధిగా వంటగది మారుతుంది. అయితే చాలామంది వంటగదిలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. వంటలు చేయడం దగ్గరి నుంచి వివిధ ఫుడ్ ఐటమ్స్‌ను నిల్వ చేసే వరకు తప్పులు చేస్తుంటారు. వాటి ప్రతికూల ప్రభావం మన ఆరోగ్యంపైనే పడుతుంది. ఇంతకీ ఆ మిస్టేక్స్(Kitchen Tips) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
చాపింగ్ ప్యాడ్
మనం కూరగాయలను కట్ చేశాక చాపింగ్ ప్యాడ్‌ను సింక్‌లో వేస్తుంటాం. అంట్లు తోమేటప్పుడు దాన్ని క్లీన్ చేస్తుంటాం. వాస్తవానికి మనం చాపింగ్ ప్యాడ్‌ను నీళ్లలో అలా పారవేయకూడదు. చాపింగ్ ప్యాడ్‌ను సింక్‌లో పారేస్తే.. అది తేమను పీల్చుకొని పాడవుతుంది.
ఫ్రిజ్- టమాటాలు
చాలామంది ఫ్రిజ్‌లో టమాటాలు నిల్వ చేస్తుంటారు. వాస్తవానికి అలా చేయకూడదు. ఫ్రిజ్‌లో పెట్టే టమాటాలు రుచిని కోల్పోతాయి. వదులుగా తయారవుతాయి.
ఆలుగడ్డ – ఉల్లిగడ్డ
మనం ఇంట్లో బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలను ఒకే దగ్గర ఉంచకూడదు. ఇవి రెండూ గ్యాస్‌ను విడుదల చేసే పదార్థాలే. అందుకే ఒకేచోట వాటిని ఉంచితే.. ఒకదాన్నొకటి ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు పాడు చేసుకుంటాయి. అందుకే వీటిని చల్లటి, పొడి ప్రదేశాల్లో వేర్వేరుగా ఉంచాలి.
Also Read : 8326 Jobs : టెన్త్ అర్హతతో 8,326 జాబ్స్.. అప్లై చేసుకోండి
ఆలుగడ్డలు ఉడకబెట్టే పద్ధతి
బంగాళాదుంపలను మరుగుతున్న నీటిలో ఉడికించకూడదు. చల్లని నీటిలో కాస్త ఉప్పు వేసి.. అందులో బంగాళాదుంపలు వేసి ఉడికించాలి. దీనివల్ల అవి ఫాస్ట్‌గా, ఫుల్‌గా ఉడుకుతాయి.
అల్లం తొక్క
అల్లం పొట్టును టీస్పూన్‌తో తీయడం బెటర్. దీనివల్ల అల్లం వేస్టు కాదు. కేవలం పొట్టు మాత్రమే తీయగలుగుతారు. ఇదే పనిని కత్తితో చేస్తే.. పొట్టుతో పాటు అల్లం కూడా వేస్టు(Mistakes in Kitchen) అవుతుంది.
మటన్, చికెన్, ఫిష్
మనం మటన్, చికెన్, ఫిష్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటాం. అయితే ఫ్రిజ్ నుంచి తీసి నేరుగా వండకూడదు. వాటిని ఫ్రిజ్ నుంచి తీశాక కనీసం గంట పాటు బయటపెట్టాలి. ఆ తర్వాత దాన్ని కడిగి శుభ్రం చేసి.. వండే ప్రక్రియను మొదలుపెట్టాలి.
తేనె
తేనె డబ్బా లోపలి నుంచి తేనెను తీసే ముందు.. ఒక స్పూన్‌ను వేడినీటిలో ముంచండి. ఆ స్పూన్‌తో డబ్బాలోని తేనెను బయటకు తీయండి. దీంతో ఆ స్పూన్ నుంచి డబ్బాకు ఏ మాత్రం అంటకుండానే తేనె వస్తుంది.
Also Read :Trains Cancelled : పలు రైళ్లు రద్దు.. ఇంకొన్ని రైళ్లు దారిమళ్లింపు
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.