మనం నిత్యం అనేక రకాల కూరల్లో కరివేపాకును వినియోగిస్తూ ఉంటాం. కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలామంది వంటల్లో వేసినా కరివేపాకుని తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఎందుకంటే కరివేపాకు వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు. అలాంటి కరివేపాకును తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇక ఈ జ్యూస్ ని తాగడం మొదలు పెడతారు. ప్రతిరోజు ఒక గ్లాసు ఈ కరివేపాకు జ్యూస్ ని తాగినట్లయితే జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ కరివేపాకులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. కరివేపాకు రసం తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఈ కరివేపాకుని వంటల్లో వాడడానికి బదులుగా నీటిని తాగడం వలన ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. మరి ఈ కరివేపాకు జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి వాటిలో కొన్ని కరివేపాకు ఆకులు వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని పరిగడుపున తాగినట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి పోతాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. ఈ కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.
ప్రతిరోజు ఈ నీటిని తాగడం వలన గుండె సంబంధిత సమస్యలు రావు.. గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ కరివేపాకు నీటిని తాగడం వలన ప్రేగు కదలికలు చురుగ్గా పనిచేసి మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి డిప్రెషన్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కరివేపాకులో క్యాల్షియం పుష్కలంగా ఉండడం వలన ఎముక పుష్టి అనేది లభిస్తుంది. అలాగే ఈ కరివేపాకు జ్యూస్ ని ప్రతిరోజు ఒక గ్లాసు తాగినట్లయితే అధిక బరువు కూడా తగ్గుతారు.