మన శరీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి. కానీ నేటి బిజీ లైఫ్ లో ఎముకల సంరక్షణకు సమయం దొరకడం లేదు. దీంతో చిన్న వయస్సుల్లోనే ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. గతంలో ముసలివాళ్లకు మాత్రమే ఎముకలు బలహీనంగా ఉండేవి. ఇప్పుడు యూత్ కూడా ఆ సమస్యను ఎదుర్కొంటోంది. మన శరీరంలో ఎముకల బలహీనంగా మారడంతో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని సంకేతాలు మన ఎముకలు చాలా వీక్ గా ఉన్నాయని తెలియజేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
దిగువ వెన్నునొప్పి:
బలహీనమైన ఎముకలలో అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి వెన్ను నొప్పి. తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం…ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. ఇవి బలహీనమైన ఎముకలకు సంకేతం.
ఎత్తు తగ్గడం:
వయస్సు పెరిగేకొద్దీ ఎత్తు తగ్గడం సాధారణం. కానీ మీకు ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు మీ ఎత్తు పెరగరు. ఎత్తు తక్కువగా ఉండటం సాధారణం అనుకుంటారు. అర అంగుళం తగ్గితే అది సాధారణం కానీ…2, లేదా 3 లేదా 4 అంగుళాలు కంటే తక్కువగా ఉంటే అది ఎముకల బహీనతే అని చెబుతున్నారు నిపుణులు.
బోన్ ఫ్రాక్చర్:
ఎముకల బలహీనంగా ఉంటే సులభంగా విరిగిపోతాయి. 50శాతం మంది స్త్రీలు, 25శాతం పురుషులు తమ జీవిత కాలంలో ఏదోక సమయంలో బోలు వ్యాధికి సంబంధించిన పగుళ్లతో బాధపడుతుంటారు. మణికట్టు, నడుము, తుంటి ఎముకలలో ఫ్రాక్చర్స్ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది.
మోనోపాజ్ :
ఎముకలు బలహీనం కారణంగా మోనోపాజ్ ప్రారంభంలో ఉంటుంది. శరీరం తగినంత ఈస్ట్రోజన్ను తయారు చేయనప్పుడు…ఎముకలను నిర్మించడానికి బదులుగా విరిగిపోతాయి. అలాంటి పరిస్థితిలో రుతివిరతి త్వరగా ప్రారంభమవుతుంది. కాబట్టి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం.
నిలబడటం కష్టంగా ఉంటుంది.
ఎముకలు బలహీనంగా ఉంటే నిటారుగా నిలబడలేరు. తొందరగా అలసిపోతారు. ముందుకు వంగినట్లుగా నడుస్తుంటారు.
మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే బలహీనమైన ఎముకల సమస్య నుంచి బయటపడవచ్చు.
కాల్షియం:
ఎముకలు బలంగా ఉండాలంటే డాక్టర్ తో మాట్లాడి సరైన మొత్తంలో కాల్షియం తీసుకోండి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
విటమిన్ డి:
ఈ విటమిన్ శరీరానికి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి ఎండలో లభిస్తుంది. కాబట్టి మీరు కొంత సమయంలో ఎండలో నిలబడటం మంచిది. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
వ్యాయామం:
ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు రోజూ అరగంట వ్యాయామం చేయడం మంచిది. వాకింగ్, జాగింగ్, యోగా, ఏరోబిక్స్ చేయవచ్చు. ఈ వ్యాయామాలన్నీ కండరాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
సరైన ఆహారం:
ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో తాజాపండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సాల్మాన్, గుడ్లు, బాదం మొదలైన వాటిని తీసుకునేలా జాగ్రత్త వహించండి.