Bishops Weeds : ఆ వంటకాల్లో వాము ఆకులు వాడొచ్చు తెలుసా !

Bishops Weeds : దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో వాము ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Bishops Weeds

Bishops Weeds

Bishops Weeds : దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో వాము ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వాము ఆకుల గురించి చాలామందికి తెలియదు. ఇవి కూడా వాములాగే ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్క ఆకులతో మీరు ఎన్నో వంటకాలను ట్రై చేయొచ్చు. నేరుగా వాము ఆకులతో కొన్ని వంటకాలు చేసుకుని.. ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • మీరు ఇంట్లో తయారు చేసుకునే స్మూతీలు, జ్యూస్​‌లు, వెజిటెబుల్ సలాడ్స్​లలో వాము ఆకులను వేసుకోవచ్చు. ఇది జ్యూస్​లకు రుచిని కూడా అందిస్తుంది. ఫలితంగా బ్లోటింగ్ సమస్యలు దూరం అవుతాయి.
  • చట్నీలలో మసాలా దినుసులతో పాటు వాము ఆకులను వేసుకోవచ్చు. ఇది మీ జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.
  • వాము ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి స్నాక్స్​ తయారీ కోసం వాడే మెటీరియల్‌లో వేయొచ్చు. ఇది కడుపులోని నులిపురుగులను దూరం చేస్తుంది.
  • వేడి వేడి పకోడీల్లో కూడా వాము ఆకులు వేయొచ్చు. ​
  • వాము ఆకులతో బజ్జీలు చేసుకోవచ్చు. శనగపిండిలో ఉప్పు వేసి బాగా కలిపి.. కడిగిన వాము ఆకులను వాటిలో వేయాలి. ఒక్కో ఆకు పిండితో పూర్తిగా ఉండేలా చూసి.. వేడి నూనెలో వేసి డీప్​ ఫ్రై చేయాలి.
  • జలుబు, దగ్గు ఉన్నప్పుడు వాము ఆకులను బాగా కడిగి.. ఓ గ్లాస్​ నీటిలో వేసి ఉడకనివ్వాలి. నీరు సగం మరిగి కషాయం అవుతుంది. దీన్ని కాస్త చల్లారిన తర్వాత తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో తేనె కలుపుకుంటే కొంత టేస్ట్ (Bishops Weeds) వస్తుంది.

Also Read: Telangana: తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన జానారెడ్డి.. అందుకేనా?

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే. 

  Last Updated: 05 Nov 2023, 12:18 PM IST