Site icon HashtagU Telugu

Money Plant Tips: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఈ టిప్స్ మీకోసమే..

Money Plant Direction

Money Plant Direction

మనీ ప్లాంట్ (Money Plant) ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవట. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్‌ ఎనర్జీని పాస్‌ చేయడంలో మనీ ప్లాంట్ ముందుంటుంది. ఇంకా ఇంట్లోని గాలిని కూడా మనీ ప్లాంట్ ప్యూరిఫై చేస్తుందట..! ఇక మనీ ప్లాంట్‌ పేరులోనే ధనం ఉంది. సో ధనం కోసమో.. అదృష్టం కోసమో ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

మనీ ప్లాంట్ (Money Plant) పేరు తగ్గట్టుగానే ఈ ప్లాంట్‌కు డబ్బును తీసుకొచ్చే గుణముందంటారు వాస్తు నిపుణులు. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందట. ఇంట్టో అదృష్టం, సంపదను తెస్తుందని చెబుతారు. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎలా పెంచాలి, ఎక్కడ పెట్టాలో తెలుసా..? వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టడమే కాకుండా కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే, మనీ ప్లాంట్ దురదృష్టానికి కారణం కావచ్చు. వేగంగా పెరిగే ఈ మొక్కను ఎక్కడబడితే అక్కడ పెంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కను నిర్దిష్ట ప్రదేశంలో పెట్టినప్పుడే అది శుభఫలితాలను ఇస్తుందట.

మనీ ప్లాంట్ ఆగ్నేయంలో ఉంటే మంచిదా అంటే అవుననే చెబుతారు వాస్తు నిపుణులు. ఇక మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఈశాన్య మూలన ఉంచకూడదట. దీనివల్ల ధననష్టం, అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి, మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఎందుకంటే ఈ దిక్కు గణేశునిది. గణేశుడి ఆధిపత్య స్థానమైన ఇంటికి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి.

ఇక మనీ ప్లాంట్‌ను నాటేటప్పుడు అది నేలకు తగలకుండా చూసుకోవాలి. మొక్క తీగ పైపైకి పెరగాలి. ఎప్పుడూ దాని తీగను కిందికి వేలాడదీయకండి. అలా చేస్తే ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎవరికీ ఇవ్వకూడదు, ఎవరి నుంచి తీసుకోకూడదు. ఇక కుండీ లేదా సీసాల్లో మనీ ప్లాంట్‌ను పెంచుకోవచ్చు. రోజూ ఈ మొక్కకు నీరు పోయటం మరిచిపోకూడదు. మనీ ప్లాంట్ ఎండిపోవడం దురదృష్టానికి సంకేతం.

Also Read:  OTT in Car: కారు స్క్రీన్‌పై ఓటీటీ యాప్స్ చూడాలనుకుంటున్నారా?