Milk – Kids : పిల్లలు ఇష్టంగా పాలు తాగేలా చేయాలా.. టిప్స్ ఇవిగో

Milk - Kids : పిల్లలకు పాలు ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారం. ఇవి పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడతాయి.

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 10:11 AM IST

Milk – Kids : పిల్లలకు పాలు ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారం. ఇవి పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడతాయి. పాలు రోజూ తాగితే ఎముకలు బలోపేతం అవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.  జీవక్రియలు వేగవంతం అవుతాయి. పాలలో ప్రొటీన్‌, పిండి పదార్థాలు, ఫ్యాట్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫోలేట్‌, కొలీన్‌, విటమిన్‌ బి12, ఏ, డి ఉంటాయి. అయితే చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి చిన్నారులకు పాలను అలవాటు చేసే టిప్స్ ఇవీ..

We’re now on WhatsApp. Click to Join.

  • పాలతో చేసే సేమ్యా, కలాకండ్, ఖీర్ భలే టేస్టీగా ఉంటాయి. అయితే కొంచెం తక్కువ చక్కెరతో వీటిని తయారు చేసుకోవాలి. వీటిని పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.
  • ఇంట్లోనే పాలతో ఐస్‌క్రీమ్ తయారు చేయవచ్చు. దాన్ని కూడా పిల్లలు తింటారు.
  • వెన్నతో  కూడిన పాలే టేస్టీగా ఉంటాయి. పాలలో వెన్న లేకపోతే పిల్లలు ఇష్టపడరు. పిల్లలకు పాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు వెన్నతోనే ఇస్తూ.. క్రమంగా అందులోని వెన్న శాతాన్ని తగ్గించాలి.
  • కార్న్‌ఫ్లేక్స్‌ను పాలలో మిక్స్‌ చేసి ఇచ్చినా పిల్లలు తింటారు. దీనివల్ల పాలు తాగడంతో పాటు పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌ కూడా పూర్తవుతుంది.
  • పాలతో రకరకాల పండ్లను కలిపి స్మూతీలు, మిల్క్‌షేక్స్‌గా తయారు చేసి పిల్లలకు ఇవ్వొచ్చు. వీటి తయారీలో పండ్ల మోతాదు తక్కువగా, పాల మోతాదు ఎక్కువగా ఉండేలా(Milk – Kids) చూసుకోవాలి.

Also Read: Cars 2024 : జనవరి 1 నుంచి కార్ల ధరలకు రెక్కలు