Beauty Tips for Dark Neck : మామూలుగా చాలామందికి ముఖం చాలా అందంగా ఉన్నప్పటికీ మెడ మాత్రం నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. మెడ గొంతు (Neck) భాగం అంతా కూడా నల్లగా మారి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పిగ్మంటేషన్, ఇతర సమస్యలు, చెమట పేరుకుపోవడం వల్ల మెడ నల్లగా (Dark Neck) మారుతుంది. ఎంత సబ్బు, క్రీమ్ రాసుకున్నా సమస్య తగ్గదు. కొంతమంది రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి వారు కొన్ని రకాల కాలనీ ఉపయోగించడం వల్ల ఎంత నల్లగా ఉన్నా మెడ (Neck) అయినా సరే తెల్లగా మారాల్సిందే. మరి అందుకోసం ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
పచ్చి బొప్పాయి తురుము, పెరుగుని మిక్స్ చేసి ఇందులోనే ఒక చెంచా రోజ్ వాటర్ కూడా కలిపి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండటం వల్ల మెడ భాగం తెల్లగా అవుతుంది. నల్లగా ఉన్న మెడను తెల్లగా చేయడంలో నిమ్మకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం నిమ్మకాయ రసాన్ని మెడ భాగానికి బాగా అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేయడం వల్ల నలుపు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అలాగే పాలు, శనగపిండి ఉపయోగించి మెడపై ఉన్న నలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ శనగ పిండిలో కొద్దిగా పాలు పోసి మిక్స్ చేసి మెడు చుట్టూ రాసి మసాజ్ చేయాలి.
10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేస్తే మెడపై మురికి తగ్గుతుంది. అలాగే బంగాళాదుంప రసం సాయంతో మెడపై పేరుకుపోయిన మురికిని తొలగించొచ్చు. దీని కోసం బంగాళాదుంప తురుము తీసుకుని అందులో నుంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని మెడకు పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత చన్నీటితో క్లీన్ చేయాలి. రెగ్యులర్‌గా చేస్తే సమస్య తగ్గుతుంది. దోసకాయని మెడపై నలుపు దనాన్ని దూరం చేసేందుకు కూడా వాడొచ్చు. అందుకోసం రెండు చెంచాల దోసకాయ రసం, ఒక చెంచా అలోవెరా జెల్ మిక్స్ చేసి పేస్టులా చేయాలి. దీనిని మెడకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత మెడని క్లీన్ చేయాలి. ఇలా చేస్తే మెడ పై ఉన్న నలుపు మొత్తం క్లీన్ అవుతుంది.
Also Read: WhatssApp Update: వాట్పాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్ ఒకసారి మాత్రమే వినగలం?