Health Tips: చలికాలంలో ఇవి తింటే వెచ్చగా ఉండడంతో పాటు.. ఆ సమస్యలకు కూడా చెక్?

చలికాలం మొదలయ్యింది. చలికాలంలో చాలామంది తెల్లవారినా కూడా ఇంట్లోంచి రావడానికి ఇష్టపడరు.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 08:30 AM IST

చలికాలం మొదలయ్యింది. చలికాలంలో చాలామంది తెల్లవారినా కూడా ఇంట్లోంచి రావడానికి ఇష్టపడరు. చలికాలంలో వీచే చల్లటి గాలుల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో శరీరం మరింత చల్లగా ఉండటం వల్ల వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి చలికాలంలో తీసుకునే ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి ఎటువంటి ఆహార పదార్థాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. బెల్లం వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే బెల్లం తో తయారు చేసిన లడ్డు తినడం కూడా మంచిది. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి అంటే బెల్లం టీ బెల్లం పాలు తాగాలి. అలాగే చలికాలంలో తేనెను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాధులతో పోరాడే శక్తిని మనకు ఇస్తుంది. కాబట్టి చలికాలంలో ప్రతిరోజు ఒక చెంచా తేనె తీసుకోవడం వల్ల జలుబు లాంటి సమస్యలు కూడా దరిచేరవు. అలాగే అల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

చలికాలంలో అల్లం టీ తాగడం వల్ల శరీరం మెదడు చురుకుగా ఉంటాయి. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చలికాలంలో ఎక్కువగా కూరగాయలతో తయారుచేసిన సూప్ లు తాగడం వల్ల శరీరం రెచ్చగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.ఎముకలు దృఢంగా మారడంతో పాటుగా కండరాలు కూడా చురుగ్గా ఉంటాయి. గుడ్డును తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. గుడ్డులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ఉడికించిన కోడి గుడ్డు తినడం వల్ల ఎంతో మంచిది.