Site icon HashtagU Telugu

5 Foods: పేగుల్లోని చెడు బ్యాక్టీరియాపై ‘పంచ్’.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే

4 Foods

4 Foods

5 Foods : మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా, పురుగులు, పరాన్నజీవులు కూడా ఉంటాయి. మంచి బ్యాక్టీరియా అనేది జీర్ణక్రియకు తోడ్పడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చెడు బ్యాక్టీరియా గట్‌ ఆరోగ్యానికి హాని చేస్తుంది.  ఆహారంలోని పోషకాలు మన శరీరానికి అందడానికి అంతరాయం కలిగిస్తాయి. అందుకే మన పేగుల్లోని ఈ నులిపురుగులను నిర్మూలించడం అవసరం. ఇందుకోసం మనం కొన్ని పవర్ ఫుల్, స్పెషల్ ఆహారాలను(5 Foods) వాడాలి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్‌ గుణాలు నిండి ఉంటాయి. వెల్లల్లి మన ఆహారంలో చేర్చుకుంటే, మన శరీరంలోని పురుగులు, అనారోగ్యకరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనం అవుతాయని నిపుణులు అంటున్నారు. గట్‌లోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి మీ ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోండి.

అల్లం

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అల్లం పరాన్నజీవుల ప్రతిచర్యల వల్ల కలిగే మంటను నయం చేయడానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో అల్లం చేర్చుకుంటే.. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

పసుపు

పసుపులో యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ ఇలా ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇందులోని కర్‌క్యుమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. దీనిలో పోషకాలు గట్‌లోని అనారోగ్యకరమైన గట్‌ బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది, అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పసుపు మీ ఆహారంలో చేర్చుకుంటే.. గట్‌ ఆరోగ్యంగా ఉంటుంది.

దోసకాయ

దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలుసు.. దోసకాయ గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. దొసకాయ గింజల పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే.. పేగులలో పురుగులు, పరాన్నజీవులు నాశనం అవుతాయని నిపుణులు అంటున్నారు. వీటి గింజలను తేనెలో కలిపి తీసుకున్న రిజల్ట్‌ ఉంటుంది.  దోసకాయ గింజల మాదిరిగానే, బొప్పాయి గింజలు కూడా మీ గట్‌లోని పురుగులను నాశనం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. బొప్పాయి గింజల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే.. మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

వాము

వంటింట్లో ఉండే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్తి సమస్యను దూరం చేయటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నం అరగకపోవడం, నిద్రలేమి, నీరసం, బిపి, మలబద్ధకం వంటి సమస్యలు వాము ద్వారా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వామును రోజూ ఆహారంలో తీసుకోవటం ద్వారా శరీరం తేలికగా ఉంటుంది. పిల్లల ఆహారంలో దీనిని వాడటం ద్వారా కడుపులో నులిపురుగులు పెరగవు. పేగుల్లో, జీర్ణాశయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. విరేచనం సందర్భంగా ఇబ్బంది పడేవారు వాము కషాయాన్ని, ఆకును వాడటం మంచిది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసింత నోట్లో వేసుకుని పడుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది.

Also Read : Advani 6 Yatras : భారతరత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 యాత్రలివే..