Site icon HashtagU Telugu

Porridge : ఈ గంజి నాలుగు రోజులు తాగితే చాలు.. మోకాళ్ళ నొప్పులు రమ్మన్నా రావు?

If You Drink This Porridge For Four Days, You Will Not Get Knee Pain...

If You Drink This Porridge For Four Days, You Will Not Get Knee Pain...

Porridge for Knee Pains : కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దాంతో పాటుగా మనుషులు కూడా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. అయితే కాలం మారినా కూడా ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో చాలామంది రాత్రి మిగిలిన చద్ది అన్నాన్ని తిని పనులకు వెళ్లేవారు చాలామంది ఉన్నారు. రాత్రి మిగిలిన అన్నం లో గంజి (Porridge) వేసి రాత్రంతా అలాగే పులియపెట్టి ఉదయాన్నే ఆ గంజితో పాటుగా అన్నాన్ని ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటారు. అయితే కొందరు ఉల్లిపాయను నంజుకొని తింటే మరికొందరు పచ్చిమిరపకాయలు నంచుకొని తింటూ ఉంటారు.

We’re Now on WhatsApp. Click to Join.

ఇలాంటి ఒక మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇటువంటి వారికి మధ్యాహ్నం వరకు కూడా ఆకలిగా అనిపించదు. మనిషికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. కానీ ప్రస్తుత మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నము. ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు అన్ని పోతున్నాయి. కాబట్టి వైట్ రైస్ అంటే ఎంత తెలుపుగా ఉంటున్నాయో అటువంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఎటువంటి పదార్థాలతో గంజి (Porridge) చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. సిరి ధాన్యాలు అంటే చిరుధాన్యాలు కావు ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు వీటిని వాడుతూ ఉంటే ఎవరైనా కానీ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలు వారి వ్యాధిని నిర్మూలించుకోవచ్చు.

ఇందుకోసం ఆ సిరి ధాన్యాలు తీసుకొని శుభ్రంగా వీటిని కడిగేసి ఆ నీటిని వంచి, ఇప్పుడు అందులో ఒక లోట సిరి ధాన్యాలకు 10 లోటాల మంచినీరు వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. అయితే ఇవి మామూలు గిన్నెలో నాన బెట్టకూడదు. మట్టి పాత్రలోనే నానబెట్టాలి. ఇలా రాత్రంతా నానిన సిరి ధాన్యాలను ఉదయం సన్నని మంట మీద 10,15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత గంజి (Porridge) తయారు అవుతుంది. అయితే వెంటనే ఆ గంజిని తాగకూడదు. దీన్ని సాయంత్రం వరకు అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుంది. ఉదయాన్నే ఈ గంజి తాగవచ్చు. ఎంతటి భయంకరమైన రోగాలైనా సరే తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ఇలా పులియపెట్టిన గంజి ఫెర్మెంటేషన్ అవుతుంది. ఇలా పోయడం వల్ల మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళుతుంది. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆ మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు నడుము నొప్పులు వాటి సమస్యలు దరిచేరవు. మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఈ గంజిని తాగడం వల్ల మోకాళ్ళ సమస్యలు మళ్లీ రమ్మన్నా కూడా రావు.

Also Read:  Rain Forecast : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే చాన్స్