Curry Leaves : కరివేపాకుతో ఇలా చేస్తే చాలు.. జుట్టు ఒత్తుగా పెరగాల్సిందే?

జుట్టు కురులను బలంగా ఉంచడంలో కరివేపాకు (Curry Leaves) బాగా పనిచేస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన జుట్టును కూడా రిపేర్ చేస్తాయి.

Published By: HashtagU Telugu Desk
If You Do This With Curry Leaves, You Have To Grow Thick Hair...

If You Do This With Curry Leaves, You Have To Grow Thick Hair...

Curry Leaves : ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే పురుషులు జుట్టు విషయంలో అంతగా శ్రద్ధ చూపకపోయినా స్త్రీలు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. కురులు అందంగా కనిపించాలని నల్లగా నిగనిగ లాడే మెరిసే అందమైన పొడవాటి జుట్టు సొంతం కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు, జుట్టు చిట్లిపోవడం, జుట్టు ఎక్కువ శాతం రాలిపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో తెల్ల జుట్టు ని కవర్ చేసుకోవడం కోసం రకరకాల హెయిర్ కలర్లు ఉపయోగిస్తూ ఉంటారు.

We’re Now on WhatsApp. Click to Join.

వాటి కారణంగా జుట్టు మరింత బలహీనంగా తయారవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆయిల్ పట్టించుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం ఆగడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ చాలు. ఒకటి కరివేపాకు (Curry Leaves) మరొకటి కొబ్బరి నూనె. కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ ఏ, బి, సి, క్యాల్షియం, అమైనో యాసిడ్స్ ఫాస్పరస్ ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. జుట్టు కురులను బలంగా ఉంచడంలో కరివేపాకు (Curry Leaves) బాగా పనిచేస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన జుట్టును కూడా రిపేర్ చేస్తాయి.

కేవలం తెల్ల జుట్టు మాత్రమే కాదు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఇంతకీ ఆ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల కొబ్బరి నూనె వేసుకోవాలి. మంటను సిమ్ లో ఉంచి కరివేపాకు రెబ్బలు (Curry Leaves) శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు తీసుకొని ఆయిల్లో వెయ్యాలి. స్లోగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉసిరికాయ పౌడర్ లేదంటే కలోంజి సీడ్స్ వేసుకోవాలి. తరువాత ఇందులో రెండు స్పూన్ల కచ్చాపచ్చాగా దంచుకున్న మెంతులను వేసుకోవాలి. పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మరిగించి కలర్ మారాక దించేసుకోని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక గాజు సీసాలోకి వడకట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ అప్లై చేస్తే రెండు నెలల్లోనే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది.

Also Read:  Crying Facts : గుడ్ టైం లేదా బ్యాడ్ టైం.. ఏడుపుతో ఆరోగ్య ప్రయోజనాలు!

  Last Updated: 24 Nov 2023, 12:20 PM IST