Site icon HashtagU Telugu

Coffee Powder: ఇకమీదట బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండా ఉండాలంటే.. కాఫీ పౌడర్ తో ఇలా చేయాల్సిందే?

Mixcollage 22 Feb 2024 04 04 Pm 2564

Mixcollage 22 Feb 2024 04 04 Pm 2564

మనం తరచూ ఉపయోగించే కాఫీ పౌడర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కాఫీ పౌడర్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాఫీ పౌడర్ ని ఉపయోగించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కాఫీ పొడితో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేయడం వల్ల అవి మీ అందాన్ని పెంచడంతోపాటు రకరకాల కొన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే కాఫీ పొడితో ఫేస్ ప్యాక్ లు ట్రై చేయడం వల్ల ఇక మీద మళ్ళీ మళ్ళీ బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే మరి కాఫీ పొడితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఉదయాన్నే కాఫీ తాగిన తర్వాత కప్పులో మిగిలిపోయిన కాఫీ గౌన్స్ ని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత కళ్ళ కింద అప్లై చేయాలి. కాసేపు ఆగిన తర్వాత చల్లని తో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. అలాగే కాఫీఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రిజ్లో పెట్టండి. అవసరమైనప్పుడు ఆ క్యూబ్స్ ని తీసుకుని ముఖంపై మర్దన చేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఫ్రెష్ లుక్ వస్తుంది. కండిషనర్లు రెండు టీ స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకి పట్టించాలి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి తర్వాత మీరు ఏ స్టైల్ లో కావాలంటే ఆ స్టైల్లో జుట్టుని దువ్వుకోవచ్చు.

అదేవిధంగా ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె కాఫీ పొడి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ముఖం కాంతివంతంగా అలాగే ఎంతో మెరుపైన చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల మీకు అందమైన స్కిన్ మీ సొంతమవుతుంది.