Site icon HashtagU Telugu

Beauty Tips: సమ్మర్ లో ఇలా చేస్తే చాలు.. మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే?

Beauty

Beauty

వేసవికాలం మొదలైంది అంటే చాలు.. ఆరోగ్య సమస్యలతో పాటు అందానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. అందుకే వేసవిలో అందం విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా వేసవిలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే అందానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. మరి వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మం మెరుపు పెరగడానికి, ముఖంపై ఉన్న నల్లటి మచ్చను పోగొట్టడానికి, సూర్యరశ్మికి నల్లబడిన చర్మ భాగాన్ని తిరిగి సహజ రంగులోకి తీసుకురావడానికి, ముఖంపై వెంట్రుకలను మొటిమలను తొలగించడానికి శనగపిండి ఎంతోగానో ఉపయోగపడుతుంది.

అయితే ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు పెద్ద చెంచాల శనగ పిండి వేసి, అందులో అర చెంచా నిమ్మరసం, ఒక పెద్ద చెంచా పాల మీగడ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై మందంగా అప్లై చేసి, మీ వేళ్లతో వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి, తర్వాత పదిహేను నుండి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. వేసవిలో రోజుకి ఒక్కసారైనా ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం.

మనం రోజూ వంటల్లో వాడే పసుపుకు, అందానికి మంచి సంబంధం ఉంది. ఎప్పటి నుంచో పసుపును చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. పసుపు చర్మ వ్యాధులకు ఔషధంగా పనిచేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక చిన్న గిన్నెలో రెండు టీస్పూన్ల పసుపు పొడి వేసి, అందులో అర టేబుల్ స్పూన్ తేనె, అదే మొత్తంలో పాలు వేసి చిక్కగా పేస్ట్ చేయాలి. ప్రభావితమైన ముఖం, మెడపై అప్లై చేసి, పదిహేను నుండి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. రోజూ పసుపుతో కూడిన ఫేస్ ప్యాక్‌ని అనుసరించడం వల్ల ముఖంపై మొటిమలు, దాని వల్ల ఏర్పడే మచ్చలు క్రమంగా మాయమవుతాయి. అలాగే వేసవిలో మెడపై చర్మం నల్లగా మారితే ఈ పసుపు ఫేస్ ప్యాక్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

Exit mobile version