Sunset : సూర్యాస్తమయం సమయంలో ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టి పీడించటం ఖాయం?

సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సూర్యాస్తమయం (Sunset) సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులు అవ్వవచ్చట.

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 06:40 PM IST

Sunset : మామూలుగా చాలామంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతిలో మిగలేకపోగా అనవసరమైన ఖర్చులు వచ్చే అదనంగా అప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో చాలామంది ఏం చేయాలో తెలియక అప్పుల భారంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలకు వాస్తు కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలకు అలాగే మానసిక సమస్యలకు కూడా వాస్తు కారణం కావచ్చు. అటువంటి సమయంలో కొన్ని రకాల పరిహారాలు పాటించడంతోపాటు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో వాస్తు విషయాలను తూచా తప్పకుండా పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

We’re Now on WhatsApp. Click to Join.

అయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సూర్యాస్తమయం (Sunset) సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులు అవ్వవచ్చట. మరి సంధ్యా సమయంలో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది అనేక రకాల నియమాలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే హిందు ధర్మంలో ఉదయ సంధ్య, సాయం సంధ్యలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయాలను ప్రదోశ వేళలు అని అంటారు. ఈ సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీ కటాక్షానికి కారణం అవుతాయని చెబుతుంటారు. సూర్యోదయ, సూర్యాస్తమయ (Sunset) సమయాల్లో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి.

ఇది సాకారత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది. సాయంత్రం సమయంలో చేసే పూజకు చాలా మహత్తు ఉంటుంది. సూర్యాస్తమయం (Sunset) సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో, తులసి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయ సమయంలో అంటే సాయం సంధ్య వేళ ఇంట్లో దీపం వెలిగించి వెలుగును ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. చీకటి నెగెటివ్ ఎనర్జీకి ఆలవాలంగా ఉంటుంది. ఒకసారి నెగెటివిటీ ఇంట్లో ప్రవేశిస్తే కష్టాల పరంపర మొదలవుతుంది. అది మనశ్శాంతి దూరం చేస్తుంది. ఆర్థిక నష్టాలు కలిగించవచ్చు. కనుక ఇంట్లో చీకటి కాకుండా జాగ్రత్త పడడం అవసరం. అలాగే సంధ్య వేళలో నిద్రపోవడం అంత మంచిది కాదు. అది ఉదయ సంధ్య అయినా సాయం అయినా సరే. అందుకే ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలు చెబుతుంటారు. సాయం సంధ్య వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇలా పడుకుంటే లక్ష్మిదేవి అలిగి వెళ్లి పోతుందట.

సంధ్యా లక్ష్మీని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. అలాగే సూర్యాస్తమయ సమయంలో తప్పనిసరిగా పితృలను తలచుకొని వారి దీవెనల కోసం వేడుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనెల వల్ల జీవితంలో దురదృష్టం ఎదురుకాకుండా ఉంటుంది. అలాగే జీవితం విజయపథంలో నడుస్తుందని నమ్మకం. పితృల దీవెనలు లేకపోతే జీవితంలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతాయి. కాబట్టి రోజు ఒకసారి పెద్దలను స్మరించుకోవడం వల్ల వారి దీవెనలు పొందవచ్చు. కష్టాలు తీరిపోతాయి. సాయంత్రం సమయంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం పట్టిపీడించడంతోపాటు దురదృష్టం దరిదాపుల్లోకి కూడా రాదు.

Also Read:  Hair Fall: మీ జుట్టు రాలుతోందా..? అయితే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేసి సమస్యకు చెక్‌ పెట్టేయండిలా..!