Site icon HashtagU Telugu

Cherry Juice: నిద్రలేమి సమస్య బాధిస్తుందా..? ప్రతిరోజూ పడుకునేముందు ఈ జ్యూస్ తాగండి..!!

Cherry Juice With Fresh Berries

Cherry Juice With Fresh Berries

నేటి కాలంలో ప్రతిఒక్కరూ ఎంతో బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఎంతగా అంటే తినడానికి…పడుకోవడానికి కూడా సమయం లేనంతగా. ఈ ఉరుకుల పరుగులు జీవితంలో ఉదయం లేచినుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొవల్సిందే. కొంతమంది అధికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ సమయంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో…దాని ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతుంటారు. ఒత్తిడి ఒక్కటే కాదు…ఆహారం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు 8 గంటల కంటే నిద్రపోయినట్లయితే…మానసిక, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. రాత్రిళ్లు ఎక్కువగా మెలుకువ ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.

మీరు కూడా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, రోజూ రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ తాగడి. ఈ జ్యూస్ ప్రతిరోజూ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది. .అంతేకాదు ఈ జ్యూస్ నిద్రలేమి సమస్యకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మేలు జరుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.

చెర్రీ జ్యూస్ తాగడం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేయడమే కాకుండా, నిద్రపోయే సమయం కూడా పెరుగుతుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో, రాత్రి నిద్రలేమికి సంబంధించి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న 8మంది వ్యక్తులపై ప్రయోగం చేశారు. ఈ వ్యక్తులకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల వారు నిద్రలేమి సమస్య నుంచి బయటపడినట్లు పరిశోధనలో తేలింది. అందుకే నిద్రలేమిలో చెర్రీ జ్యూస్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. చెర్రీ జ్యూస్‌లో చాలా సమ్మేళనాలు ఉన్నాయని, ఇది అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్‌ను పెంచుతుందని చెప్పారు. ఇది శరీరంలో సెరోటోనిన్‌ను విడుదల చేయడంతోపాటు గా సెరోటోనిన్ అనేది మెదడుకు విశ్రాంతిని ఇచ్చే సహజ ట్రాన్స్‌మిటర్ ఇందులో ఉంది. దీని వల్ల రాత్రి తొందరగా నిద్ర వస్తుంది.

మీరు కూడా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, మీరు రోజూ రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్‌ని తీసుకోవచ్చు. అయితే, సేవించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ జ్యూస్‌లో చక్కెరను అస్సలు చేర్చవచ్చు. అలాగే రాత్రిపూట అతిగా తినకూడదు.