Health Talk : ప్రతిరోజూ ఈ 6 రకాల ఆకులను నమిలితే రోగాలు పరార్..!!

మనంనిత్యం తీసుకునే ఆహారంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు ఉంటాయి. వీటన్నింటినీ ఆరోగ్య నిధిగా చెబుతుంటారు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 08:49 AM IST

మనంనిత్యం తీసుకునే ఆహారంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు ఉంటాయి!! వీటన్నింటినీ ఆరోగ్య నిధిగా చెబుతుంటారు!! అయితే మీరు ఎప్పుడైనా మొక్కల ఆకుల గురించి ఆలోచించారా? కూరలో కరివేపాకు వస్తే తీసి పక్కన పడేస్తుంటారు!! కానీ కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసు !! తెలిసినా…పక్కన పెడతాం. అలాంటి ఆకులు ఎన్నో ఉన్నాయి!!

వాటన్నింటిలో విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్,ఫైబర్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లుతోపాటు ఇతర పోషకాలు ఉంటాయి. అయితే ఈ ఆకులను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె, రక్తంలో చక్కెర, రోగనిరోధక వ్యవస్థ వాటిపై మంచి ప్రభావం చూపుతుంది. మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆరు రకాల ఆకుల గురించి తెలుసుకుందాం.

పుదీనా ఆకులు:
పుదీనా ఆకులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది పొట్టను చల్లబరుస్తుంది, అజీర్ణాన్ని పోగొట్టి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం ఖనిజాలు, సి, డి, ఇ, ఎ వంటి విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. పుదీనా ఆకులను మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

మెంతి ఆకులు:
మెంతి ఆకులలో ఫైటోన్యూట్రియెంట్లు విటమిన్ సి, విటమిన్ ఎ బీటా కెరోటిన్ వంటి అనేక యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ ఆకులు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. దీంతో గ్లూకోజ్ నియంత్రణలో కూడా సహాయపడతాయి. కాల్షియం మంచి మూలం కాబట్టి, నిత్యం మెంతి ఆకులను ఆహారంలో చేర్చుకున్నట్లయితే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా సహాయపడుతుంది.

తులసి ఆకులు:
తులసి ఆకులు వాటి ఔషధ గుణాల గురించి మనందరికీ తెలిసిందే. తులసీ ఆకులను నమలినట్లయితే రోగనిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది . మీరు తులసి ఆకులను డైరెక్టుగా నమలవచ్చు. లేదంటే తులసి టీ తయారు చేసుకుని తాగవచ్చు. తులసీ టీ తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కరివేపాకు:
కరివేపాకును వంటలలో ఉపయోగిస్తుంటాం. కరివేపాకు అతిసారం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుకు మంచిది. ఖాళీ కడుపుతో 4-5 తాజా కరివేపాకులను కూడా నమలుతే మంచిది.

కొత్తిమీర ఆకులు:
కొత్తిమీర ఆకులను వంటకాలపై మెరినేట్ చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా కొత్తిమీర ఆకులతో చట్నీ కూడా చేస్తారు. కొత్తిమీర ఆకులు మీ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి, ఇన్ఫెక్షన్‌తో పోరాడుతాయి. గుండె, మెదడు, చర్మం, జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.

తోటకూర ఆకులు:
ఇందులో ఆస్పరాగస్‌లో అస్పార్టిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలో కనిపించే అదనపు అమ్మోనియాను తటస్థీకరించడంలో సహాయపడుతుంది. అంతేకాదు శరీర బలహీనతను తొలగించడంలోనూ సహాయపడుతుంది. విటమిన్లు సి ఇ ఫోలేట్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.