Beauty Tips : జుట్టు చివర్లను కట్ చేస్తే…తొందరగా పెరుగుతుందా..? ఎంత వరకు వాస్తవం..!!

జుట్టు ఎంత మందంగా ఉంటే...అంత అందంగా కనిపిస్తాం. ఆస్తులు పోయినా బాధపడం కానీ...జుట్టు పోతే మాత్రం ఎక్కడలేని బాధను అనుభవిస్తాం. అయితే చాలామంది జుట్టును కట్ చేస్తుంటారు. ఎందుకంటే జుట్టు చివరిలోకట్ చేస్తే తొందరగా పెరుగుతుందని చెబుతుంటారు.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 10:20 AM IST

జుట్టు ఎంత మందంగా ఉంటే…అంత అందంగా కనిపిస్తాం. ఆస్తులు పోయినా బాధపడం కానీ…జుట్టు పోతే మాత్రం ఎక్కడలేని బాధను అనుభవిస్తాం. అయితే చాలామంది జుట్టును కట్ చేస్తుంటారు. ఎందుకంటే జుట్టు చివరిలోకట్ చేస్తే తొందరగా పెరుగుతుందని చెబుతుంటారు. చాలామంది ఇదే చెబుతుంటే…మనం కూడా నిజమేనని నమ్ముతుంటాం. అసలు జుట్టు కట్ చేస్తే త్వరగా పెరుగుతుందా…ఎంత వరకు నిజం…తెలుసుకుందాం.

జుట్టు కత్తిరిస్తే…త్వరగా పెరుగుతుందా అనే ప్రశ్నకు కాదనే సమాధానం చెప్పాలి. క్రమం తప్పకుంగా కత్తిరించడం వల్ల జుట్టు పెరుగదు. అసలు జుట్టు పెరగడానికి దానికి సంబంధం లేదు. జుట్టు కుదుళ్లపై కత్తిరింపులు ఎలాంటి ప్రభావం చూపదట. ఇది జుట్టు పెరుగుదలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి తలకు సంబంధం లేని విషయం జుట్టుకు ఎలా సాధ్యమవుతుంది. క్రమంతప్పకుండా జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు పెరగదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇది జుట్టు ఆరోగ్యంగా..మందంగా..మెరిసేలా చేస్తుంది. ఎందుకంటే డెడ్ హెయిర్ కత్తిరిస్తారు. రెగ్యులర్ జుట్టు కత్తిరింపులు సరైన దిశలో కదలడానికి, జుట్టు పెరగడానికి కూడా సహాయం పడుతుంది. జుట్టు చివర్లు చిట్లిపోయే అవకాశం ఉన్నవారు క్రమం తప్పకుండా కత్తిరించుకోవడం మంచిది. ఎందుకంటే స్ల్పిట్స్ ఎండ్స్ జుట్టును మరింత బలహీనపరుస్తాయి. ఫలితంగా జుట్టు పెరగదు.

చిట్లిపోయిన వెంట్రుకలను కత్తిరించడం వల్ల జుట్టు సరిగ్గా పెరుగుతుంది. నెలకు 1నుంచి 15 సెంటిమీటర్ల వరకు పెరుగుతుంది. మీరు మీ జుట్టును కత్తిరించకూడదనుకుంటే…హెయిర్ డ్రెస్సర్ ను డస్ట్ చేయమని చెప్పండి. అప్పుడు స్ప్లిట్స్ ఎండ్స్, దెబ్బతిన్న జుట్టును మాత్రమే తొలగిస్తారు. తలకు, జుట్టుకు మంచినూనెతో మసాజ్ చేస్తే…జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. దీంతో జుట్టు పెరుగుతుంది. మసాజ్ తో రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు సరైన పోషకాహారం ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. కొబ్బరినూనె, ఆముదం, ఏదైనా క్యారియర్ ఆయిల్ లేదంటే బాదం నూనెను ఉపయోగించవచ్చు. వారానికోసారి మసాజ్ చేస్తే నిర్జివమైన జుట్టు శుభ్రం అవుతుంది.