Site icon HashtagU Telugu

ICE: ఐస్ తో ముఖానికి మర్దనా చేస్తే అందం పెరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Ice

Ice

ముఖం అందంగా కనిపించడం కోసం చాలామంది ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉంటారు. రకరకాల హోమ్ రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అందులో ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసుకోవడం కూడా ఒకటి. ఇలా చేసుకుంటే ఫేస్ గ్లోయింగ్ ఉంటుందని, అందం కూడా పెరుగుతుందని అంటున్నారు. నిజంగానే ఈ టిప్ అంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముఖానికి ఐస్‌ రుద్దితే మంచిది అని ఎలాంటి ఆధారాలు లేవు అని చెబుతున్నారు. ఇలా ముఖానికి ఐస్​ అప్లై చేసుకోవడం చైనీస్‌ స్కిన్‌కేర్‌ లో ఒక భాగం. కాలంతో పాటు క్రమంగా ఈ బ్యూటీ టిప్​ మన దగ్గరికీ వచ్చింది. ఈ విధానాన్ని చాలా మంది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. అయితే ముఖ్యంగా ఫేస్​ ఉబ్బినా, కళ కోల్పోయినట్లుగా కనిపించినా ఈ టిప్​ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ముఖానికి ఐస్​ తో మర్దన చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగవుతుందట. దీని వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని చర్మం బిగుతుగా అనిపిస్తుందట. అలాగే స్కిన్​ కొద్దిగా నిగనిగలాడుతున్నట్లూ కనిపిస్తుందట. ముఖానికి ఐస్‌ రుద్దిన తర్వాత మేకప్‌ వేస్తే ఫేస్​ కి చక్కగా పట్టేస్తుందట. అందుకే ఎక్కువ మంది ఈ చిట్కా ఫాలో అవుతుంటారని వైద్యులు చెబుతున్నారు.

ఈ చిట్కా ఫాలో అయ్యేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే అదే పనిగా నేరుగా ముఖానికి ఐస్​ తో మసాజ్​ చేసుకోకూడదట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుందట. ఫేస్​ కి ఐస్​ ని నేరుగా అప్లై చేయకుండా, ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి, మృదువుగా వృత్తాకారంలో మసాజ్‌ చేసుకోవాలి. ముఖానికి ఐస్‌ పెట్టాక ఫేస్​ పొడిబారుతుంది. కాబట్టి మాయిశ్చరైజర్‌ తప్పకుండా ఉపయోగించాలట.