Hyderabad Biryani : హైదరాబాద్‌లో బిర్యానీ చెఫ్‌లకు భారీ డిమాండ్.. కార‌ణం ఇదే..?

హైద‌రాబాద్‌లో బిర్యాని తీనేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. న‌గ‌రంలో ఎక్క‌డ బిర్యాని తిన్నా రుచిక‌రంగా

  • Written By:
  • Publish Date - August 28, 2022 / 01:00 PM IST

హైద‌రాబాద్‌లో బిర్యాని తీనేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. న‌గ‌రంలో ఎక్క‌డ బిర్యాని తిన్నా రుచిక‌రంగా ఉంటుంద‌నేది బిర్యాని ల‌వ‌ర్స్ అభిప్రాయం. ఏ గ‌ల్లీలో బిర్యాని హోట‌ళ్లు చూసిన కిట‌కిట‌లాడుతూ ఉంటాయి. బిర్యానీ టెస్ట్‌గా ఉందంటే భోజ‌న ప్రియులు ఆ హోట‌ల్‌ని వ‌దిలిపెట్ట‌రు. కాబ‌ట్టి హోట‌ల్ యాజ‌మానులు మంచి బిర్యానీ చెఫ్‌ని తీసుకువ‌చ్చి నోరురించే బిర్యానీని త‌య‌రు చేయించి క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తుంటారు. దీంతో న‌గ‌రంలో బిర్యానీ వండే వారికి ఫుల్ డిమాండ్ పెరిగింది. జంట నగరాల్లో బిర్యానీ చెఫ్‌లకు ఏడాది పొడవునా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వారికిచ్చే జీతాలు వారు బిర్యానీని ఎంత రుచిగా చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

నగరంలో ఈ వంట మాస్టర్‌లు రాజ్ భవన్ ఎదురుగా MS మక్తా, నాంపల్లి వద్ద యూసుఫైన్ దర్గా, చార్మినార్ సమీపంలోని షాహలీబండ సమీపంలో వీరంతా ఉంటారు. బిర్యానీ చెఫ్‌లు ఫ్రీలాన్స‌ర్‌లుగా ప‌ని చేస్తుంటారు. ఒక సారి వంట చేయడానికి కనీస ధర రూ. 2,000 నుండి మొదలవుతుంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్న MS మక్తాకు చెందిన హైదరాబాదీ బిర్యానీ స్పెషలిస్ట్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ.. త‌న‌ మాస్టర్ ‘ఉస్తాద్’ మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేయడం ప్రారంభించినప్పుడు త‌న‌కు 12 సంవత్సరాల వ‌య‌సు అని.. ఆయ‌న కుటుంబ కార్యక్రమాల కోసం వండుతారని తెలిపారు. త‌న‌ మొదటి జీతం నెలకు ఐదు రూపాయలని… అసలైన హైదరాబాదీ బిర్యానీ కోసం ఎదురుచూసే వారు పేరున్న బిర్యానీ చెఫ్‌ల‌ను తీసుకువ‌చ్చుకుంటార‌ని ఆయ‌న తెలిపారు.