Husband and Wife భర్తలను ఇంప్రెస్ చేసేందుకు ఏం చేయాలి..?

భార్యా భర్తల మధ్య సత్సంబంధాలకు (Husband and Wife) వారి మధ్య మంచి అన్యోన్యతకు పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి లేదు

Published By: HashtagU Telugu Desk
Husband And Wife Impress Hu

Husband And Wife Impress Hu

భార్యా భర్తల మధ్య సత్సంబంధాలకు (Husband and Wife) వారి మధ్య మంచి అన్యోన్యతకు పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి లేదు. ముందు భార్యలు భర్తలను ఇంప్రెస్ చేయడం మొదలు పెడితే సగం సమస్యలు తీరిపోతాయని కొందరు నిపుణులు అంటున్నారు. జీవిత బండిని లాక్కొస్తూ తను ఎంత కష్టపడినా ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలని చూసే భర్తను భార్య ఎప్పుడూ ప్రేమగా చూస్తే అసలు భార్యా భర్తల మధ్య ఎలాంటి గొడవలు రావని అంటున్నారు.

అంతేకాదు భార్య ఎప్పటికప్పుడు భర్తని ఇంప్రెస్ చేసేలా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుందని అంటున్నారు. భర్తకు అనుకువగా ఉండటం.. ఆయన మూడ్ ని బట్టి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నిర్ణయించుకోవడం. భర్తకి ఎక్కువ విసుగు కలిగించే మాటలు సందర్భాలు మాట్లాడకపోవడం మంచిదని అంటున్నారు.

ఆఫీస్ ల నుంచి బయట నుంచి వచ్చిన భర్తకు మంచి నీళ్లు ఇచ్చి మెప్పుపొందడం. ఆయనకు ఎప్పుడు తోడుగా ఉంటానని బరోసా ఇవ్వడం.. ముద్దుగా ప్రేమగా ఎల్లప్పుడూ అతని మీద ప్రేమ చూపించడం లాంటివి చేయడం భర్తలు (Husband and Wife) తాము ఎంత కష్టపడినా సరే మర్చిపోతారని. భర్తలను ఇంప్రెస్ చేసే భార్యల మీద వారికి ఎక్కువ ప్రేమ ఉంటుందని ఒకవేళ అది ఎక్స్ ప్రెస్ చేసేలా ఉండకపోయినా వారి పనుల వల్ల అవి తెలుస్తాయని అంటున్నారు.

భర్తకు మసాజ్ చేయడం అతనితో బయటకు వెళ్లి స్పెండ్ చేయడం లాంటివి చేస్తుండాలి. భర్తని దగ్గరకు తీసుకోవడంలో భార్య ఎప్పుడు ముందుండాలి వారి పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి అప్పుడు భార్యా భర్తల మధ్య ఎలాంటి దూరం ఉండదని. వారి మధ్య ప్రేమ ఎప్పుడూ కొనసాగుతుందని చెబుతున్నారు.

Also Read : Woman Stole : కాబోయే భార్య కోటి రూపాయల టోకరా..!

  Last Updated: 22 Sep 2023, 11:14 AM IST