Turmeric and Allergies: పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు రాస్తారు? దీని వెనుక కారణం ఏంటీ?

హిందువులు సాధారణంగా ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో మొదట పసుపుకు ఎక్కువ ప్రాధాన్యం

  • Written By:
  • Publish Date - August 20, 2022 / 02:00 PM IST

హిందువులు సాధారణంగా ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో మొదట పసుపుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు అన్నది శుభానికి గుర్తు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కలిగించే ఒక ఔషది, సంపదను ఇచ్చే కల్పవల్లి అని చెప్పవచ్చు. ఈ పసుపును కేవలం పూజలో మాత్రమే కాకుండా ప్రతిరోజు వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. శుభకార్యాల విషయానికొస్తే ముఖ్యంగా పెళ్లిళ్లలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పెళ్లికి ముందు రోజు వధువు వరులకు మంగళ స్నానానికి ముందు వారికి పసుపు బాగా రాస్తారు. అయితే పెళ్లి సమయంలో ఎందుకు ఇలా పసుపు రాస్తారు అన్నది చాలా మందికి తెలియదు.

దీనికి అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి. పసుపు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చర్మానికి సంబంధించిన ఎటువంటి ఉత్పత్తులలో అయినా కూడా ఈ పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా పెళ్లి సమయంలో కొంతమంది చందనం పాలు లేదంటే రోజ్ వాటర్, పసుపును కలిపిన మిశ్రమాన్ని పెళ్లికూతురు పెళ్ళికొడుకులకు రాస్తూ ఉంటారు. దీనిని చర్మానికి పోయడం వల్ల మొటిమలు, ముడతలు వంటి సమస్యలు పోయి చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకప్పటి వాళ్లకు ఇది ఒక బ్యూటీ పార్లర్ లాంటిదే అని చెప్పవచ్చు.

చాలామంది వధువు వరులు పెళ్లికి ముందు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాము అంటూ కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే పెళ్లికి ముందు పసుపును పూయడం వల్ల ఆ ఒత్తిడి తగ్గుతుందట. అంతేకాకుండా పసుపులో ఉండే కర్కుమిన్ ఒత్తిడిని తగ్గించడంతోపాటు యాంగ్జైటీ, డిప్రెష‌న్ వంటివి త‌గ్గించేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటితో పాటుగా శరీరంలోకి చేరిన దుష్టశక్తులను పారదోలే శక్తి కూడా పసుపుకు ఉందట. అందువల్లే వధువు వరుల పై ఇటువంటి గాలి, ధూళి తగలకుండా ఉండడం కోసం పసుపు రాస్తారు. ఇలా పసుపు పూజి మంగళ స్నానాలు చేయించడం వల్ల వారి ముఖాలలో పెళ్లి కళ మరింత ఉట్టిపడుతున్నట్లుగా ఉంది అని భావిస్తూ ఉంటారు. అలాగే పెళ్ళిల్లో తలస్నానాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతోమంది కలుస్తూ ఉంటారు. అలర్జీలకు చెక్ చెప్పడానికి పసుపుని ఉపయోగిస్తూ ఉంటారు.