Teeth Whitening: పళ్ళు తెల్లగా మెరిసిపోవాలంటే పేస్టులో ఇవి కలిపి శుభ్రం చేసుకోవాల్సిందే?

మామూలుగా చాలామందికి పళ్ళు గార పట్టి పసుపచ్చ రంగులో ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొందరికి అయితే పూర్తిగా పాచి పట్టిపోయి చూడడానిక

  • Written By:
  • Updated On - February 12, 2024 / 09:56 PM IST

మామూలుగా చాలామందికి పళ్ళు గార పట్టి పసుపచ్చ రంగులో ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొందరికి అయితే పూర్తిగా పాచి పట్టిపోయి చూడడానికే చాలా అందవిహీనంగా, అధ్వానంగా కనిపిస్తూ ఉంటాయి. పసుపు పచ్చ పళ్ళ కారణంగా చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దంతాలు పసుపు పచ్చ రంగులోకి మారడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మనం తీసుకునే ఆహార పదార్థాలు పానీయాలు ఇవన్నీ కూడా ఒక కారణం కావచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా తెల్లని ఆ ముత్యాల లాంటి దంతాలు కావాలని కోరుకుంటూ ఉంటారు.

అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా తెల్లటి పళ్ళు కావాలనుకుంటున్నారా. అయితే ఇలా చేయాల్సిందే.. పళ్ళు తెల్లగా మెరిసేందుకు ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది. ఉప్పు, నిమ్మరసం, అల్లం అవసరం. ఉప్పు, నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి పల్ళపై ఉన్న మరకలని క్లీన్ చేస్తాయి. అదే విధంగా ఉప్పుతో చిగుళ్ళ సమస్యకి మందులా పనిచేస్తుంది. ముందుగా మీ నోటిని ఉప్పునీటితో క్లీన్ చేయాలి. అల్లంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక క్రిమినాశక గుణాలు కూడా ఉన్నాయి. ఇవి దంతాలని తెల్లగా కనిపించేలా చేస్తాయి. అల్లంని వాడితే దంత, చిగుళ్ళ సమస్యలు దూరమవుతాయి.

నిమ్మకాయలోని బ్లీచింగ్ గుణాలు పళ్ళపై ఉన్న మరకలని దూరం చేస్తాయి. దీని వల్ల నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. అయితే.. ఎక్కువగా నిమ్మరసం వాడకూడదు. దీని వల్ల దంతాలు పళ్ళు బలహీనమవుతాయి. రెండు చుక్కల నిమ్మరసం సరిపోతుంది. ముందుగా ఒక చిన్న ముక్క అల్లంని తీసుకుని పేస్టులా చేయాలి. అందులో రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఉప్పు కూడా వేయాలి. ఈ మూడింటిని బాగా కలిపి పళ్ళు తోమొచ్చు. కావాలంటే టూత్‌పేస్టులో కలిపి తోమొచ్చు. ఇలా వారంలో 2 సార్లు చేయండి పళ్ళు తెల్లగా అందంగా మారతాయి.​

Follow us