Beauty Tips: ఈ ఒక్క క్యాప్సూల్‌తో మచ్చలు, మొటిమలకు చెక్ పెట్టండిలా?

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మచ్చలేని మెరిసే చర్మం కావాలని కోరుతూ ఉంటారు. ఇక అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 10:30 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మచ్చలేని మెరిసే చర్మం కావాలని కోరుతూ ఉంటారు. ఇక అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం అవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మార్గాల ద్వారా కూడా ఈ మొటిమలు మచ్చలు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ మార్గం కూడా ఒకటి. దీని వల్ల చాలా ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. హెయిర్‌కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. విటమిన్ ఇ క్యాప్సూల్. ఇది ప్రతి మెడికల్ షాపులో దొరుకుతుంది. దీని వల్ల బ్యూటీ బెనిపిట్స్ చాలా ఉన్నాయి.

దీనిని వాడడం వల్ల స్కిన్ మెరుస్తుంది. జుట్టుకి కూడా మంచిది. విటమిన్ ఇ క్యాప్సూల్ వాడడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది. చర్మంపై ముడతలు, గీతలు పడకుండా చేస్తుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌ లా పనిచేసి చర్మ కణాలను బిగుతుగా చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్‌ చాలా మందంగా ఉంటుంది. దీనిని నేరుగా అలానే అప్లై చేయలేం. ఇందులో మరో నూనె కలిపి వాడొచ్చు. ఇందులో భాగంగా కొబ్బరినూనె, బాదం నూనె కలిపి వాడొచ్చు. అలోవెరా జెల్‌లో విటమిన్ ఇ ఆయిల్ కలిపి వాడొచ్చు.

ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మంపై ముడతలు, గీతలని దూరం చేస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని కలబందతో కలిపి రాస్తే చర్మం మెరుస్తుంది. అదే విధంగా రోజ్‌వాటర్‌లో విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి రాయండి. దీని వల్ల ముఖం మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. దీనిని రోజ్ వాటర్‌లా కలిపి రాస్తే ముఖం కాంతి వంతంగా, మృదువుగా మారుతుంది. చర్మాన్ని మెరిసేలా చేసేందుకు ఈ ఆయిల్‌ని పెరుగులో కూడా కలిపి వాడొచ్చు.