Site icon HashtagU Telugu

Vitamin E Capsules: విటమిన్ ఈ క్యాప్సిల్స్ తో మెరిసే చర్మం మీ సొంతం.. అందుకోసం ఏం చేయాలంటే!

Vitamin E Capsules

Vitamin E Capsules

మాములుగా ప్రతీ ఒక్కరు అందమైన మెరిసే చర్మం కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడంతోపాటు హోమ్ రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. వీటి వల్ల కేవలం తాత్కాలికంగా మాత్రమే నిగారింపు వస్తుంది. కొన్నిసార్లు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరిసే అందమైన చర్మం పర్మినెంట్గా సొంతం కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడంలో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి వీటిని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే..

విటమిన్ ఈ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ సంరక్షణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉపయోగించవచ్చట. మీరు అలోవెరా జెల్‌తో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉపయోగించవచ్చట. దీని కోసం మీరు ఒక స్పూన్ అలోవెరా జెల్‌ లో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపి సహజ మాయిశ్చరైజర్ లా తయారు చేసుకోవచ్చట. తర్వాత దీన్ని మీ ముఖం, మెడ అంతటా పూర్తిగా అప్లై చేయాలట. రాత్రి పడుకునే ముందు దీన్ని వాడటం మంచిదని చెబుతున్నారు. మరుసటి రోజు ఉదయం, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలట. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ ముఖంపై మచ్చలు తగ్గిపోయి మీ చర్మం సహజమైన మెరుపును పొందవచ్చు అని చెబుతున్నారు.

అలాగే కొబ్బరి నూనె,విటమిన్ ఈ క్యాపిల్స్ కలయిక మీ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. దీనివల్ల మీ చర్మం మెరుస్తుందట. ఇందుకోసం రాత్రిపూట 1 టీస్పూన్ కొబ్బరి నూనెతో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ నూనెను బాగా కలిపి. మెడతో సహా మొత్తం ముఖం మీద అప్లై చేసి కొన్ని సెకన్ల పాటు మసాజ్ చేసి అలాగే వదిలేయాలట. ఉదయం గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలట.

పెరుగుతో విటమిన్ ఈ ని ఉపయోగించడానికి1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలపాలట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా అప్లై చేసి చేతులతో 1 నిమిషం పాటు మసాజ్ చేయాలట. ఈ మిశ్రమాన్ని ముఖం మీద 20 నిమిషాలు ఉంచిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల మీ ముఖం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు.

విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ ను తేనెతో కలిపి కూడా ముఖానికి అప్లై చేయవచ్చట. రెండు విటమిన్ ఈ క్యాప్యూల్స్ ఒక టీస్పూన్ తేనెతో కలపాలట. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత శుభ్రం చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందని,అంతే కాకుండా చర్మం కూడా పొడిబారకుండా ఉంటుందని చెబుతున్నారు.

గ్లిజరిన్‌ ను విటమిన్ ఈ తో కలిపి మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం మృదువుగా, తేమగా మారుతుందట అంతే కాకుండా మీ చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది. మీరు 1 విటమిన్ ఈ క్యాప్సూల్‌ ని కొన్ని చుక్కల గ్లిజరిన్‌ తో కలిపి పడుకునే ముందు మీ ముఖంపై సమానంగా అప్లై చేయాలట. ఇలా చేయడం వల్ల కూడా ముఖం అందంగా మెరిసిపోతుందని చెబుతున్నారు.