Site icon HashtagU Telugu

Beauty Tips: వాడేసిన టీ పొడి వల్ల అన్ని రకాల ప్రయోజనాల.. అందాన్ని రెట్టింపు చేసుక. కోవచ్చట?

Mixcollage 06 Feb 2024 02 06 Pm 8412

Mixcollage 06 Feb 2024 02 06 Pm 8412

మామూలుగా మనం టీ చేసిన తర్వాత టీ పొడిని పారేస్తూ ఉంటాం. ఇంకొందరు మాత్రం టీ పొడిని అలాగే పెట్టుకుని చెట్లకు ఒక ఎరువుల కూడా వేస్తూ ఉంటారు. అయితే ఈ మిగిలిపోయిన టీ పొడిని చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుందట? మరి మిగిలిపోయిన టీ పొడిని మీ బ్యూటీ రొటీన్‌లో ఇలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాడిన టీ పొడిని స్క్రబ్రర్‌లా ఉపయోగించవచ్చు. వాడిన టీ పొడిని ఎండలో ఆరనిచ్చి,ఆ తరువాత ఈ పొడిలో, చక్కెర నీళ్లు కలపాలి. ఈ మిక్స్‌తో ముఖంపై, చేతులపై స్క్రబ్‌ చేయాలి. ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకుని, మాయిశ్చరయిజర్‌ అప్లై చేయాలి. ఇది ఎక్స్‌ఫోలియేట్‌గా పని చేస్తుంది. ముఖానికి అద్భతమైన గ్లో ఇస్తుంది.

టీ పొడి కంటి కింద నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది. టీ పొడిలో ఉండే కెఫిన్‌ కంటి కింద ఉండే రక్తనాళాలను సంకోచించడానికి సహాయపడుతుంది. రెండు టీ బ్యాగ్‌లను తడిపి, కళ్లపై ఉంచండి. వీటిని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్ల కింద నల్లటి వలయాలు తొలగుతాయి. మాములుగా కొందరి మోచేతులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. మోచేతుల నలుపు తగ్గించడానికి వాడిన టీ పొడి సహాయపడుతుంది. మీరు మిగిలిన టీ పొడిని ఎండలో ఆరబెట్టి గ్రైండర్‌లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. దీన్ని కంటైనర్లో స్టోర్‌ చేసుకోవచ్చు. ఈ పొడిలో కొద్దిగా బేకింగ్‌ సోడా, నిమ్మరసం మిక్స్‌ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ మీ చేతులకు అప్లై చేయాలి.

ఇలా రోజూ చేస్తే మోతుల నలుపు తగ్గుతుంది. పెదాలు పగిలితే వాటిని తగ్గించడానికి టీ పొడి హెల్ప్‌ అవుతుంది. గ్రీన్ టీ బ్యాగ్‌ని గోరువెచ్చని నీటిలో ముంచి పెదవులపై ఉంచాలి. ఇలా రోజూ చేస్తే పెదాలు క్రమంగా నయమవుతాయి. మీ పెదవులు మృదువుగా మారతాయి. కాళ్ల పగుళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కాళ్ల పగుళ్లను తగ్గించడానికి.. టీ పొడి సహాయపడుతుంది. ఇందుకోసం వాడిన టీ పొడిని బాగా శుభ్రం చేయాలి. ఒక టీ స్పూన్‌ టీ పొడిలో, 1 టీస్పూన్ ఓట్స్, కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి మిక్స్‌ చేయండి. దీన్ని కాళ్ల మడమలకు అప్లై చేయండి. కొంత సేపు ఆరనివ్వండి. ఆ తర్వాత పాదలాకు స్క్రబ్‌లా రుద్ది, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కాళ్ళ పగుళ్ల సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు.