Beauty Tips: మీ ముఖం అందంగా కనిపించడంతో పాటు మెరిసిపోవాలంటే పసుపుతో ఇలా చేయాల్సిందే?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 12:00 PM IST

పసుపు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ లో ఈ పసుపుని తప్పకుండా వినియోగిస్తుంటారు. తరచూ అందానికి పసుపును ఉపయోగించడం వల్ల అందం మరింత పెరుగుతుంది. మరి పసుపుతో అందాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పసుపుతో పాటూ హెల్దీ స్కిన్ కి అవసరమైన మరి కొన్ని వస్తువులు తేనె, కొబ్బరి నూనె, పెరుగు. తేనె మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. యాక్నే స్కార్స్ ని హీల్ చేయడం లో హెల్ప్ చేసి స్కిన్ ని మృదువుగా చేస్తుంది.

కొబ్బరి నూనె వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ యంగ్ గా కనిపించేందుకు హెల్ప్ చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి, స్కిన్ యొక్క పీహెచ్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ – 1-3 టీ స్పూన్లు, పెరుగు ఒక టేబుల్ స్పూన్, తేనె – ఒక టీ స్పూన్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ – ఒక టీ స్పూన్, మెజరింగ్ స్పూన్స్, మిక్సింగ్ బౌల్. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక బౌల్ లో పెరుగు వేసి, ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలపాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కలపాలి. తర్వాత ఇందులో పసుపు కలపాలి.

ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసి ఈ మిశ్రమం స్మూత్ గా వచ్చేంతవరకూ కలపాలి. అంతే మీ ఫేస్ మాస్క్ రెడీ. ఈ మిశ్రమాన్ని ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా ఫేస్ వాష్ చేసుకుని తడి పోయేటట్లుగా ఏదైనా క్లాతుతో కానీ తుడుచుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ని అప్లై చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే వదిలేసి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే కాంతులీనే చర్మం మీ సొంతం అవుతుంది.