Tulsi for Acne : తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మటుమాయం?

ప్రస్తుత రోజుల్లో చాలామంది మొటిమల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. మొటిమలు వాటి తాలూకా వచ్చే నల్లటి మచ్చల సమస్య కారణ

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 10:10 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది మొటిమల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. మొటిమలు వాటి తాలూకా వచ్చే నల్లటి మచ్చల సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆ నల్లటి మచ్చలను పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లను హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు.
అయితే ఇంట్లో ఉండే తులసి ఆకులతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి ఆకుల్లో ఎన్నో మంచి మంచి గుణాలు. అందుకే వీటిని ఎప్పటినుంచి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఆకులు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మొటిమలని దూరం చేస్తుంది. అదేవిధంగా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల వచ్చే నొప్పి, చీము, ఉపశమనాన్ని దూరం చేస్తాయి. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మొటిమలు, ఎండ నుంచి వచ్చే సమస్యల్ని దూరం చేస్తాయి.

ఇందుకోసం తులసి ఆకుల్ని పేస్టులా చేసి అందులో అలోవేరా జెల్ కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత దీనిని చన్నీటితో కడిగేయాలి. అదేవిధంగా, తులసి ఆకు పేస్టులో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. దీనిని పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మొటిమలు, మొటిమలతో వచ్చే నల్ల మచ్చలు కూడా దూరమవుతాయి.అలాగే సమాన పరిమాణంలో వేపాకు, తులసి ఆకుల్ని తీసుకుని పేస్టులా చేయాలి. ఇందులో రెండు చుక్కల టీట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. వారానికి 3 సార్లు ఇలా తయారైన పేస్ట్‌ని అప్లై చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

తులసి ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసి అందులో చందనాన్ని కలపాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు తగ్గిపోవడమే కాకుండా మెరుస్తుంది.ఒక పిడికెడు తులసి ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసి అందులో 2 చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉండండి. ఇది మొటిమలు తగ్గేలా చేస్తుంది.