Tulsi Benefits: తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. ముఖం మెరవడం ఖాయం?

మామూలుగా చాలామంది ముఖం అందంగా కనిపించాలని ఏవేవో బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు రకరకాల హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 12:00 PM IST

మామూలుగా చాలామంది ముఖం అందంగా కనిపించాలని ఏవేవో బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు రకరకాల హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల మంచి ఫలితాలు కంటే చెడు ఫలితాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా అందంగా కనిపించడం కోసం, అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా తులసి ఆకులతో మెరిసిపోయే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది అందానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాగా తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇనన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. తులసిని రుద్దడం వల్ల చర్మంపై వచ్చే చికాకులని తగ్గించి చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మ దురద, ఎరుపుని తగ్గిస్తుంది. తులసి ఆకులని రుద్దడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్, మురికిని దూరం చేసి స్కిన్ టోన్‌‌ని మెరుగ్గా చేస్తుంది. తులసి బలమైన ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని ముఖానికి రాయడం వల్ల రంధ్రాలు తగ్గి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గుతాయి.

తులసిని చర్మానికి అప్లై చేస్తే ముఖం మెరుస్తుంది. నల్ల మచ్చలు తగ్గుతుంది. తులసి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వార చర్మం స్థితిస్థాపకత, దృఢత్వాన్ని నిర్వహించడానికి సాయపడుతుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది హానికరమైన యూవీ కిరణాలు, హాని నుండి చర్మాన్ని రక్షిస్తుంది. తులసిలో సహజ ఆస్ట్రింజెంట్ లక్షణాలు సెబమ్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో చర్మంపై జిడ్డుని తగ్గిస్తుంది. తులసిలోని యాంటీ ఫంగల్ గుణాలు, ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.