Glowing Skin: ముఖంపై మచ్చలు తగ్గాలి అంటే టమోటాతో ఇలా చేయాల్సిందే?

టమోటాల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 11:08 PM IST

టమోటాల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్లడానికి ఇష్టపడని వారు వెళ్లే సమయం లేని వారు టమోటాతో ఇంట్లోనే కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ని ఫాలో అయితే చాలు మెరిసే అందమైన చర్మం మీ సొంతం. అయితే ఇందుకోసం టమాట రసం, కాఫీ పొడి, తేనె కలిపి వాడొచ్చు. దీని వల్ల ముఖం యవ్వనంగా మారుతుంది. బ్యూటీ పార్లర్స్, ఫేషియల్స్ చేసుకోవడం అందరికీ కుదరదు. అలాంటి వారు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మీ స్కిన్‌ని మెరిపించొచ్చు.

టమాటలు, కాఫీ పొడి, తేనె అవసరం. టమాటల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. టమాటల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఎలాస్టిన్, కొల్లాజెన్ పెరిగి ముఖ ముడతలు తగ్గుతాయి. చర్మంపై నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. కాఫీ పౌడర్ బ్యూటీ కేర్‌లో ముందుంటుంది. దీంతో చాలా ఫేస్ మాస్క్‌లు తయారు చేస్తారు. ఇది మంచి స్క్రబ్ అని చెప్పొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో హెల్ప్ అవుతాయి. దీంతో ఎండ, వాయుకాలుష్యం వల్ల చర్మంపై వచ్చే సమస్యల్ని దూరం చేస్తుంది. తేనెలో కొల్లాజెన్ ఉంటుంది. దీని వల్ల స్కిన్ అందంగా మారడమే కాకుండా చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది. తేనె వాడితే మొటిమలు తగ్గుతాయి. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

చర్మంలో తేమ, మెరుపు పెరుగుతుంది. సన్‌స్పాట్స్‌ని కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుకోవచ్చు. ముందుగా టమాటల్ని అడ్డంగా సగానికి కట్ చేసుకోవాలి. ఓ ముక్కని తీసుకుని కాఫీ పౌడర్‌లో డిప్ చేయాలి. గ్రైన్ కాఫీ పౌడర్ అయితే మంచిది. ముందుగా ముఖాన్ని కడుక్కుని ముఖం పొడిగా మారిన తర్వాత కాఫీ పొడిలో ముంచిన టమాటతో ముఖంపై రుద్దాలి. ఇక 10 నిమిషాల తర్వాతల ముఖంపై తేనెని ప్లై చేసి మసాజ్ చేయాలి. 2 నిమిషాలు మసాజ్ చేసి 20 నిమిషాలు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్ చేస్తే ముఖంపై మచ్చలు, ముడతలు తగ్గి అందంగా మారతుంది.