Beauty Tips: టమోటాలో ఇది కలిపి రాస్తే చాలు క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం?

చాలామంది ముఖం అందంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 10 Feb 2024 12 50 Pm 9270

Mixcollage 10 Feb 2024 12 50 Pm 9270

చాలామంది ముఖం అందంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ వేలకు వేలు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు తగిన విధంగా ఫలితం లభించదు. అలాంటప్పుడు ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి క్షణంలోనే మెరిసిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించడం వల్ల మీ ముఖం అందంగా కనిపించడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

చర్మాన్ని కాపాడడంలో టమాట, పసుపు రెండూ కూడా చక్కని గుణాలని కలిగి ఉంటాయి. విడివిడిగానే ఈ రెండూ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని కలిపి అప్లై చేయడం వల్ల చక్కని మెరుపు మీ సొంతమవుతుంది. అయితే ఇందుకోసం బాగా పండిని టమాని తీసుకుని గ్రైండ్ చేయాలి. ఇందులో పసుపు వేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. కంటి దగ్గర చేయకపోవడమే మంచిది.

తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి..అయితే, ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. చేతులకి ప్యాక్ వేసి ఎలాంటి అలర్జీ లేదనుకున్నాకే ఈ ప్యాక్ అప్లై చేయాలి. ఇలా చేస్తే చాలు క్షణాల్లోనే మెరిసిపోయే అందం మీ సొంతం అవడం ఖాయం. అప్పుడప్పుడు టమోటా ని నేరుగా ముఖంపై అప్లై చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత ముఖం కడుక్కుంటే చాలు ముఖంపై ఉండే దుమ్ము ధూళి వంటివి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

  Last Updated: 10 Feb 2024, 12:51 PM IST