Site icon HashtagU Telugu

Beauty Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా మొటిమలు తగ్గలేదా.. అయితే బంగాళదుంపతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 02 Dec 2023 07 11 Pm 5033

Mixcollage 02 Dec 2023 07 11 Pm 5033

ప్రస్తుత రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మొటిమల సమస్య కూడా ఒకటి. ఈ మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ మొటిమలు వచ్చినప్పుడు చాలా మంది వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లోనే దొరికే హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మొటిమలు తగ్గవు. అంతేకాకుండా మొటిమలు తాలూకా మచ్చలు అలాగే ఉండిపోతాయి. అయితే మీరు కూడా ఎన్ని రకాల చిట్కాలు ఉపయోగించినా కూడా మొటిమలు తగ్గడం లేదా. అయితే బంగాళదుంపతో ఇలా చేయాల్సిందే.

మరి బంగాళదుంపతో మొటిమలు ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుంప అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బంగాళదుంపలు నటిమలు మచ్చలు వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. అలాగే బంగాళదుంప మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. బియ్యం పిండి అనేది మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల చర్మానికి రంగు రావడమే కాకుండా సన్ టాన్ వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ పిండిని వాడడం వల్ల మురికి, ఇతర మలినాలు దూరమై చర్మం మెరుస్తుంది. అలాగే చాలా మంది మేకప్ కిట్‌లో రోజ్ వాటర్ కూడా ఒకటి.

ఇది చక్కని క్లెన్సర్‌లా పనిచేస్తుంది. రోజ్‌వాటర్‌ని అన్ని రకాల స్కిన్ టైప్ వారు వాడొచ్చు. దీనిని వాడడం వల్ల చర్మ రంధ్రాలు అన్‌క్లాగ్ అవుతాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇకపోతే బంగాళాదుంప సగం ముక్క తీసుకుని తురిమి దాని నుండి రసాన్ని తీయాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. అందులోనే బియ్యపిండి, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ట్రేలో వేసి క్యూబ్స్‌లా చేయాలి. ఈ ఐస్ క్యూబ్స్‌ ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లార్చి మరుసటి రోజున మీ ముఖంపై మసాజ్ చేయాలి. ఆపై 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి.