Beauty Tips: చుండ్రు సమస్యకు వేపాకుతో చెక్ పెట్టిండిలా?

చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చుండ్రు కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్లాల

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 10:30 PM IST

చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చుండ్రు కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.. తలలో విపరీతమైన దురద, తల, భుజాలపై డ్యాండ్రఫ్‌ కనిపిస్తూ చికాకు తెప్పిస్తుంది. తలమీద చర్మం పొడిబారడం, దానికి సూక్ష్మక్రిములు తోడవడం వల్ల ఈ కాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, జుట్టు పూర్తిగా ఆరకముందే జడవేసుకోవడం వంటి కారణాల వల్ల కూడా డ్యాండ్రఫ్‌ వచ్చే అవకాశం ఉంది.

చుండ్రును తగ్గించుకోవడం కోసం చాలామంది అనేక రకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే రకరకాల షాంపులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ప చుండు సమస్య తగ్గదు. అయితే వేపతో రెండు సమస్య తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అధిక చుండ్రుతో బాధపడేవారు ముందుగా కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి ఆ నీరు మొత్తం ఆకుపచ్చగా మారేవరకు నీటిని ఉడికించి తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి..

ముందుగా మన జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకుని ఆ తర్వాత చల్లగా అయినటువంటి ఈ వేపాకు నీటితో మన తలని కడగడం వల్ల చుండ్రు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయటం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా వేడి చేసిన వేప నూనెని చల్లబరిచి అందులో ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆముదం కలిపి ఒక సీసాలో భద్రపరుచుకొని, వారానికి రెండుసార్లు తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం చుండ్రు సమస్య తగ్గుతుంది. చాలామంది మార్కెట్లో దొరికే రక రకాలు షాంపూలను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఉపయోగించడానికి ముందు ఒకటికి రెండుసార్లు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.