Mobile Phone : మొబైల్ ను ఎండాకాలంలో ఎలా వాడాలో తెలుసా?

సాధారణంగానే ఫోన్ ఎక్కువసేపు వాడితే హీట్ ఎక్కుతుంది. ఎండాకాలంలో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంటుంది.

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 09:00 PM IST

Mobile Phone : ఎండాకాలంలో(Summer) మనమే ఎండకు తట్టుకోలేకపోతున్నాము. అలాగే ఫోన్స్ కూడా వేడికి హీట్ ఎక్కుతాయి. సాధారణంగానే ఫోన్ ఎక్కువసేపు వాడితే హీట్ ఎక్కుతుంది. ఎండాకాలంలో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంటుంది. అందుకే ఎండాకాలంలో మొబైల్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మొబైల్స్ ఎండ వేడికి మామూలుగా వేడి కంటే ఎక్కువగా వేడిగా అవుతాయి.

* మొబైల్ వేడి తగ్గేవరకు ఫోన్ పౌచ్ తీసేసి ఫోన్ ని వాడకుండా పక్కకు పెట్టుకోవాలి.
* మొబైల్ వేడి తగ్గేవరకు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టకూడదు.
* మొబైల్ ను ఎండ పడే ప్రదేశాలలో ఛార్జింగ్ పెట్టకూడదు.
* మొబైల్ వేడిగా ఉన్నప్పుడు నీడ ఉండే ప్రదేశాలలో, ఫ్యాన్, ఏసీ ఉన్న రూమ్స్ లో ఉంచాలి.
* మనం మొబైల్ ని వేడిగా ఉన్నా వాడితే స్లో అయిపోతుంది.
* కార్లలో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి.
* మొబైల్స్ కి వాడే చార్జర్లు డూబ్లీకేట్ వి కాకుండా మనం ఏ కంపెనీ ఫోన్ వాడతామో ఆ కంపెనీ చార్జర్ ఉపయోగించుకోవాలి.
* మొబైల్ వేడెక్కింది పొరపాటున కూడా ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు.
* ఛార్జింగ్ పూర్తిగా తగ్గేకంటే ముందే ఛార్జింగ్ పెట్టుకోవాలి.

Also Read : Parenting Tips : వేసవి సెలవుల్లో పిల్లలను ఎలా బిజీగా ఉంచాలి..!