వేసవికాలం వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ మామిడికాయల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేసవిలో మామిడి పండ్లకు బాగా డిమాండ్ ఎక్కువ. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం మామిడి పండ్ల వల్ల మాత్రమే కాకుండా మామిడి ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయట. మామిడి ఆకులు ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి మామిడి ఆకులతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయట. మామిడి ఆకుల్ని ముఖం మీద ఉపయోగించినప్పుడు, సూర్య కిరణాలు, కాలుష్యం లేదా ఇతర ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం రక్షణ కలుగుతుందట. మామిడి ఆకులు చర్మాన్ని రక్షిస్తాయని చెబుతున్నారు. కాగా మామిడి ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గించవచ్చట. ఇకపోతే మామిడి ఆకులలో మాంగిఫెరిన్ సమ్మేళనాలు కనిపిస్తాయి. ఇవి మొటిమల వల్ల కలిగే మచ్చల్ని తగ్గించడంలో సహాయపడతాయట. మొటిమల సమస్యతో బాధపడేవారికి మామిడి ఆకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.
మామిడి ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచుకోవచ్చట. గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే ముఖానికి తాజా మామిడి ఆకుల్ని వాడాలట. ఈ ఆకుల్లో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం నల్లబడటం నుంచి కాపాడుతుందట. అలాగే చర్మంపై ఉన్న నల్లటి మచ్చల్ని తగ్గించుకోవచ్చట. మామిడి ఆకుల్ని తరచుగా వాడితే చర్మం మెరుస్తుందట. గ్లాసీ గ్లోయింగ్ స్కిన్ సొంతమవుతుందని చెబుతున్నారు. మామిడి ఆకులలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందట. అందుకే అవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయట. వీటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుందట. కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం ముడతలు పడటం ఆగుతుందట. చర్మంపై ఉన్న ముడతల్ని తగ్గించడంలో మామిడి ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ మామిడి ఆకులను ఎలా వాడాలి అంటే. ఐదు మామిడి ఆకుల్ని తీసుకుని మంచి నీటితో కడగాలి. ఆ తర్వాత వాటిని పాన్‌లో వేయించాలి. ఆ తర్వాత ఆ ఆకుల్ని తీసుకుని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుని పొడి ఉన్న గిన్నెలో రెండు చెంచాల కొబ్బరి నూనె వేయాలి. ఆ తర్వాత వీటిని బాగా మిక్స్ చేసి మందపాటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టుని ముఖం మొత్తానికి బాగా అప్లై చేయాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా అప్లై చేయడం వల్ల ముఖంలో మార్పులు కనిపిస్తాయటట.