Lemon: నిమ్మకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. నిమ్మకాయను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. బాడీ డిటాక్స్ అవ్వడానికి కూడా లెమన్ వాటర్ ఉపయోగపడతాయని అనుకుంటారు. కానీ ఇందులో పూర్తి స్థాయిలో నిజం లేదట. కానీ నిమ్మకాయను కలపడం వల్ల నీటికి ఫ్యాట్ బర్నింగ్ గుణం వస్తుందని, అందుకే రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల చాలా త్వరగా ఫ్యాట్ కరిగిపోతుందని, దీంతో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే చాలా త్వరగా ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
కాగా నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. వీటి వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటకు పంపించడంలో కీలకంగా పని చేస్తుందట. అయితే అన్నింటి కన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిమ్మకాయతో బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. నిమ్మకాయ మాత్రమే బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుందట. డైట్ లో రోజూ నిమ్మకాయను చేర్చుకుంటే మాత్రం శరీరంలో కొవ్వు కరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. సహజంగా బరువు తగ్గేందుకు ఉన్న మార్గాల్లో ఇదీ కూడా ఒకటీ అని చెబుతున్నారు.
ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల కూడా కేలరీలు చాలా త్వరగా కరిగిపోతాయట. మరీ నిమ్మకాయను ఎలా వాడాలి అనే విషయానికొస్తే.. నిమ్మకాయ నీరు తీసుకోవడం వల్ల హైడ్రేషన్ అవడంతో పాటు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందట. నీరు సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగవడంతో పాటు కేలరీలు కరిగిపోతాయట. టీ, కాఫీలు తాగడానికి బదులుగా సింపుల్ గా లెమన్ వాటర్ తో రోజుని మొదలు పెట్టడం ఈజీ అని చెబుతున్నారు. రోజులో సాధారణంగా చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. వీటిని మానేసి ఒక సారి లెమన్ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే చాలు. కనీసం 100 నుంచి 200 కేలరీలు కరిగిపోతాయని చెబుతున్నారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల విటమిన్ సి సరైన విధంగా శరీరానికి అందుతుందట. పొట్టలో జీర్ణ శక్తికి అవసరమైన యాసిడ్ ని ఉత్పత్తి చేయడంలో ఇది తోడ్పుతుందట. మొత్తంగా జీర్ణ శక్తిని పెంచుతుందని, అన్నింటి కన్నా ముఖ్యంగా లెమన్ వాటర్ తాగడం వల్ల కడుపు నిండినట్టుగా అవుతుందని, ఫలితంగా అనారోగ్యకరమైన ఆకలి దూరమవుతుందని,ఎప్పటికీ హైడ్రేటెడ్ గా ఉంటారని చెబుతున్నారు. కేవలం లెమన్ వాటర్ మాత్రమే కాకుండా నిమ్మకాయలను వివిధ రూపాలలో తరచూ డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.
Lemon: కేవలం ఒక్క నిమ్మకాయతో బరువుతో పాటు బాణ లాంటి పొట్టి తగ్గించుకోండిలా!

Lemon