Iron Box : ఐరన్ బాక్స్ వాడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఐరన్ బాక్స్ వాడేటప్పుడు కొన్ని టిప్స్ వాడితే మంచిది.

  • Written By:
  • Publish Date - June 19, 2024 / 09:00 PM IST

Iron Box : ఐరన్ బాక్స్ ను ఇప్పుడు అందరూ తమ ఇళ్లల్లో రెగ్యులర్ గా వాడుతున్నారు. అయితే ఐరన్ బాక్స్ వాడేటప్పుడు కొన్ని టిప్స్ వాడితే మంచిది.

* ఐరన్ బాక్స్ వాడేటప్పుడు మంచి బ్రాండెడ్ ది వాడితే మంచిది. లేకపోతే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది.
* ఐరన్ బాక్స్ వాడేటప్పుడు ఐరన్ బాక్స్ కి సంబంధించిన యూజర్ మాన్యువల్ తప్పకుండా చదవాలి. అప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి.
* ఐరన్ బాక్స్ వాడిన తరువాత వెంటనే అట్టపెట్టలో పెట్టకూడదు. అది చల్లారిన తరువాత పెట్టాలి.
* ఐరన్ బాక్స్ వాడిన వెంటనే వైర్ చుట్టకూడదు అలా చేస్తే వైర్ కాలిపోయే ప్రమాదం ఉంది.
* ఐరన్ బాక్స్ ప్లగ్ పెట్టె సాచెట్ ఎన్ని వాట్ల సామర్ధ్యం తట్టుకోగలదో చూసి వాడుకోవాలి. అంతేకాని ఎక్కువ లోడ్ వాడితే అది పాడయ్యే అవకాశం ఉంది.
* స్టీమ్ ఐరన్ బాక్స్ వాడితే ప్లగ్ ఆఫ్ లో ఉన్నప్పుడే నీటిని పోసుకోవాలి. లేకపోతే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
* స్టీమ్ ఐరన్ బాక్స్ వాడేవారు వాడిన తరువాత దానిలో ఏమైనా నీరు మిగిలి ఉంటే వాటిని తీసెయ్యాలి. ఆ తరువాతే జాగ్రత్త చేసుకోవాలి.
* ఐరన్ బాక్స్ వాడేటప్పుడు పిల్లలు,పెట్స్ దూరంగా ఉండేలా చూసుకోవాలి.

ఈ విధంగా ఐరన్ బాక్స్ ని వాడేటప్పుడు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ఐరన్ బాక్స్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. అలాగే మనకు ఎటువంటి హాని కలుగకుండా ఉంటుంది.

 

Also Read : Laptop : లాప్‌టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా..? దానివల్ల వచ్చే సమస్యలు..