మనం టీవీలలో లేదంటే యూట్యూబ్ లో అలాగే కొన్నిసార్లు ఎప్పుడైనా లైవ్ లో కొరియన్స్ ని మనం చూసే ఉంటాం. వీరు చాలా తెల్లగా ఉండడంతో పాటు ముఖం మీద ఎలాంటి మచ్చలు పింపుల్స్ లేకుండా ఉంటారు. వీరిని చూసినప్పుడు చాలామంది మేము కూడా అలాగే ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు కూడా కొరియన్స్ వారిలా మారాలి అంటే అన్నంతో ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించాల్సిందే అని చెబుతున్నారు. మరి అన్నంతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అన్నం కేవలం తినడానికి మాత్రమే కాదండోయ్ అందాన్ని పెంచడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అన్నంలో మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట. దీనిలో ఉండే విటమిన్ బి చర్మ కణాల పనితీరును మెరుగుపరుస్తుందట. అన్నంలో ఉండే విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుందట. కాగా రైస్ లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో సరైన హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందట. అన్నం మన చర్మాన్ని హైడ్రేట్ గా, మరింత మృదువుగా చేస్తుందని, అలాగే డ్రై స్కిన్ సమస్యే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
అన్నాన్ని గ్రైండ్ చేసి మీరు స్మూత్ నేచురల్ ఎక్స్ఫోలియంట్ గా కూడా వాడుకోవచ్చట. ఇది మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుందట. పై చర్మాన్ని మెరిసేలా చేస్తుందట. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇదెంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. చర్మంలోని అదనపు నూనెను గ్రహించడానికి అన్నం చాలా బాగా ఉపయోగపడుతుందట. ఇకపోతే మీరు బియ్యం నీటిని టోనర్ గా ఉపయోగించినా లేదా ఫేస్ మాస్క్ లో బియ్యం పిండిని కలిపినా జిడ్డు నియంత్రణలో ఉంటుందట. అలాగే మొటిమలు కూడా తొందరగా తగ్గిపోతాయట. అన్నంలో ఉండే పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని, ఇది ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
1/2 కప్పు వండిన అన్నం, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగు,1 టీస్పూన్ తేనె,3 నుంచి 4 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి తర్వాత ఆ నీటిని తీసేసి బియ్యాన్ని 2 నుంచి 3 రోజులు నిల్వ ఉంచాలి. ఆ తర్వాత దీన్ని నార్మల్ గా వండాలి. అంటే దీనిలో ఉప్పు గానీ, మసాలాలు గానీ వేయకూడదు. ఈ అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వాలి. అయితే ఈ అన్నం మెత్తగా, కొద్దిగా జిగటగా ఉండాలి. అన్నం చల్లారిన తర్వాత ఫోర్క్ లేదా స్పూన్ తో మెత్తగా రుబ్బి ముతక పేస్ట్ లా తయారు చేయాలి. ఈ అన్నంలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగును వేసి కలపాలి. ఇది మాస్క్ కు మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుందట. తర్వాత దీనిలో 1 టీస్పూన్ తేనె వేసి కలపాలట. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుందని, మంచి వాసన రావడానికి మీరు దీనిలో కొన్ని రకాల నూనెలను కూడా కలపవచ్చు అని చెబుతున్నారు..